సరికొత్త రికార్డు సృష్టించిన సైరా… అదరగొడుతున్న ఆర్డిఎక్స్ లవ్ ట్రైలర్

Share Icons:

హైదరాబాద్:

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం. తెలుగు వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 2న తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో భారీ స్థాయిలో సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

అయితే భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాల టాక్‌. అయితే లేటెస్ట్‌గా విన‌ప‌డుతున్న స‌మాచారం మేర సైరా డిజిట‌ల్ హ‌క్కులు కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడ‌య్యాయ‌ట‌. వివ‌రాల ప్ర‌కారం ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను రూ.40కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుందట‌. ఇంత మొత్తంలో డిజిట‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న ద‌క్షిణాది చిత్ర‌మిదేన‌ని అంటున్నాయి.

ఆర్‌డి‌ఎక్స్ లవ్ ట్రైలర్

‘హుషారు’ ఫేమ్ తేజు కథానాయకుడిగా .. పాయల్ రాజ్ పుత్ కథానాయికగా ‘ఆర్ డి ఎక్స్ లవ్’ నిర్మితమైంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ , రొమాన్స్ , యాక్షన్, ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ నరేశ్ .. నాగినీడు .. ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ ఆమని ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.

‘ప్రతిరోజూ పండగే’ ప్రీ లుక్ రిలీజ్

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా రూపొందుతోంది. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున పల్లె .. మరో వైపున పట్నం ఈ రెండింటి మధ్య పెనవేసుకున్న బలమైన బంధం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఫస్టులుక్ ను రేపు రాత్రి 8 గంటలకి విడుదల చేయనున్నారు.

 

Leave a Reply