సరికొత్త స్టోరీతో చిరు-కొరటాల సినిమా: క్రిష్ డైరెక్షన్ లో పవన్ సినిమా?

Share Icons:

హైదరాబాద్: ఇటీవలే సైరా లాంటి చరిత్రాత్మక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. దేవాలయాల చుట్టూ అల్లుకున్న అవినీతిని తన తాజా చిత్రంలో కొరటాల చూపించనున్నట్టు తెలుస్తోంది. తన ప్రతి సినిమాలోను ఏదో ఒక సామాజిక సమస్యను గురించి ప్రస్తావిస్తూ ఆలోచించేలా చేయడం ఆయనకి అలవాటు.

ఈ సినిమాలో దేవాదాయశాఖలో ఉద్యోగి అయిన కథానాయకుడు, ఆ వ్యవస్థలోని అవినీతిని ఎలా అంతమొందించాడనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. నవంబరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

క్రిష్-పవన్ కాబినేషన్

జనసేన పేరిట పార్టీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉన్న పవన్ కల్యాణ్ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన సినిమాలు చేయనని చెప్పేశారు. కానీ ఆయన సినిమా చేస్తున్నారంటూ రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఈ క్రమంలోనే పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఓ కథతో పవన్ కల్యాణ్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మెప్పించారని,  క్రిష్ దర్శకత్వంలో త్వరలోనే పవన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే పవన్, క్రిష్ ల కాంబినేషన్లో కొత్త సినిమా వస్తున్నట్టే. అయితే ఇది ఎంత వరకు నిజమనే విషయం తెలియాలంటే మాత్రం… అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.

కార్తీ ఖైదీ విడుదల….

కార్తీ కథానాయకుడిగా తమిళంలో ‘ఖైదీ’ సినిమా నిర్మితమైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో, పారిపోయిన ఖైదీగా కార్తీ కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా విడుదల తేదీపై అంతా దృష్టి పెట్టారు. తెలుగులో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న కె.కె.రాధామోహన్, ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి.  అయితే ఈ సినిమాలో హీరోయిన్, రొమాన్స్ , పాటలు ఏమి ఉండవు.

 

Leave a Reply