Chiranjeevi: మెగా ర్యాప్.. చిరంజీవి పుట్టినరోజు కానుక.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా ప్లాన్ చేశారో చూడండి!

Share Icons:
మరికొద్ది రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతోంది. ఆగస్టు 22వ తేదీన ఆయన 65వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ ఆయన బర్త్ డే హంగామా స్టార్ట్ చేశారు. మెగాస్టార్‌కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా మెగాస్టార్ కానుకగా ఫ్యాన్స్ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతుండటం విశేషం.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు కంటే ముందు రోజే రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శనివారం సాయంత్రం 7గంటలకు విడుదల చేశారు. ఈ నెల 21న ఈ మెగా ర్యాప్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

Also Read:
గతంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శివ చెర్రీ నేతృత్వంలో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురి ప్రశంసలు అందుకుంది. సినీ ప్రముఖులు ప్రత్యేకంగా ఈ పాట గురించి కొనియాడారు. మెగా ర్యాప్‌కు కూడా అలాంటి ఆదరణే లభిస్తుందని శివ చెర్రీ ఆశిస్తున్నారు. మరోవైపు చిరంజీవి చేస్తున్న తాజా మూవీ ‘ఆచార్య’ నుంచి కూడా ఏదైనా సర్‌ప్రైజ్ ఉంటుందేమో అని ఆసక్తిగా ఇఫుడు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.