చేతులతో తడుముతూ… తాకరానిచోట తాకాడు: సింగర్‌ చిన్మయి..!!

Share Icons:

హైదరాబాద్, 13 మర్చి:

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపులకు గురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఆదివారం నాడు తాను ఓ కార్యక్రమానికి వెళ్లానని అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ తనను లైంగికంగా తాకాడని ఆమె అన్నారు.

అయితే ఈ వేధింపుల విషయాన్ని సన్నిహితులతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్లు కూడా తాము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వేధింపులకు గురైన విషయాన్ని తెలుసుకుని షాకయ్యా అన్నారు.

చిన్నారులు తమ ఉపాధ్యాయులు, అంకుల్స్‌ చివరకు మహిళల చేతిలో కూడా వేధింపులు ఎదుర్కొన్నవారు ఉన్నారని ఆమె ట్వీట్ చేశారు. సమాజంలో బస్సులు,

రైళ్లతో పాటు ఆధ్యాత్మిక స్థలాల్లో, ఇళ్లలో, విద్యాలయాల్లోనూ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె అన్నారు.

తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పడానికి చాలామంది చిన్నారులకు ధైర్యం చాలాదని అన్నారు.

ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా వారికి అండగా నిలవాల్సింది పోయి.. ఆమె ఎలాంటి వస్త్రాలు వేసుకుంది, లిప్‌స్టిక్, జుట్టు, స్కిన్ కలర్, దుస్తులు, ప్రవర్తన లాంటి విషయాల్లో బ్లేమ్ చేయడం పనిగా పెట్టుకున్నారని,

సాటి మహిళ వేధింపులకు గురైతే మహిళలే ఇలాంటి కామెంట్ చేస్తున్నారని దయచేసి వాళ్లని బ్లేమ్ చేయడం ఆపాలని కోరారు.

లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్తే.. చదువు, ఉద్యోగాన్ని మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారేమోనన్న భయంతో అమ్మాయిలు వెనుకాడుతున్నారని ఇలాంటి సందర్భంలో వాళ్లకు అండగా నిలబడాలన్నారు.

మీ అనుమతి లేకుండా మిమ్మిల్ని ఎవరైనా తాకాలని ప్రయత్నిస్తే.. వెంటనే వాళ్ల చెంప పగలగొట్టండి.. మౌనంగా ఉండకండంటూ పిలుపునిచ్చారు చిన్మయి.

మామాట: ధైర్యం చెయ్యకపోతే ఎలా..?

English Summary: Singer Chinmayi Sripaada was allegedly molested at an event on Sunday evening and she took to social media to share her shocking ordeal. Through Instagram stories and later through a series of tweets, the singer shared the details of the incident and urged women to speak up when caught in a similar situations. In her tweet, Chinmayi said, “After almost aeons I got groped at an event yesterday.

Leave a Reply