చైనాలో.. వీర్య సేకరణ యంత్రాలు!! (వీడియో)

Share Icons:

బీజింగ్, ఏప్రిల్ 18,

చైనాలో ఓ కంపెనీ తయారు చేసిన మెషీన్ వీడియో వైరల్‌గా మారింది. ఆ మెషీన్ పేరు SW-3701. స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్. అంటే వీర్యాన్ని సేకరించే మెషీన్. సంతానం లేనివాళ్లకు చేసే ప్రత్యామ్నాయ సంతానోత్పత్తి చికిత్సా పద్ధతులైన ఐవీఎఫ్, ఐయూఐలో వీర్యం సేకరించడం తప్పనిసరి. వీర్యాన్ని భర్త నుంచి లేదా దాతల నుంచి సేకరిస్తుంటారు వైద్యులు. వీర్యాన్ని సేకరించే పద్ధతుల్లో దాతలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించిన ఓ కంపెనీ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్ మెషీన్‌ను తయారు చేసింది. ఆ మెషీన్ వీడియో వైరల్‌గా మారింది.

స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్ మెషీన్‌ను చైనా కంపెనీ జియాంగ్సు సాన్వే మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ తయారు చేసింది. వాస్తవానికి ఈ మెషీన్ అమ్మకాలు 2005లోనే మొదలయ్యాయి. కానీ ఇటీవల ఈ మెషీన్లకు డిమాండ్ పెరిగింది. చైనాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులో హ్యాండ్స్ ఫ్రీ సొల్యూషన్‌గా చెప్పుకునే ఈ మెషీన్లు కనిపిస్తున్నాయి. చైనా కంపెనీ తయారు చేసిన స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్ మెషీన్ SW-3701 ఇదే. దాతల నుంచి ఈ మెషీన్ ద్వారానే వీర్యాన్ని సేకరిస్తున్నారు.

ప్రెజర్, స్పీడ్ కంట్రోల్‌ని అడ్జెస్ట్ చేస్తూ దాతలకు అసౌకర్యం, ఇబ్బంది లేకుండా వీర్యాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేయడం ఈ మెషీన్ ప్రత్యేకత. వీర్యాన్ని వేగంగా, సురక్షితంగా సేకరించడం SW-3701 స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్‌తో సాధ్యమని సంస్థ బ్రోచర్‌పై కనిపిస్తుంది. స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్‌కు డిమాండ్ పెరగడంతో ఇలాంటి మెషీన్లను తయారు చేసేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. విదేశాల నుంచి చైనా కంపెనీలకు ఆర్డర్లు కూడా వస్తుండటం విశేషం. మెషీన్ ద్వారా వీర్యం సేకరించడం ద్వారా నాణ్యత బాగుంటుందని, తర్వాతి ప్రాసెస్‌లో చికిత్సలో ఇబ్బందులు ఉండవన్నది వైద్యులు చెబుతున్న మాట. ఈ మెషీన్ ధర 6000 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.4 లక్షలకు పైనే.

 

మామాట: సైన్స్ అభివృద్ధి చెందడం అంటే ఇదా…

Leave a Reply