TRENDING NOW

ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెనను ప్రారంభించిన జిన్‌పింగ్

ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెనను ప్రారంభించిన జిన్‌పింగ్

బీజింగ్, 23 అక్టోబర్:

ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెనను చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ప్రారంభించారు. హాంగ్ కాంగ్ నుంచి మ‌కావ్ వ‌ర‌కు వెళ్లే ఈ బ్రిడ్జ్ 55 కిలోమీట‌ర్ల పొడువు ఉంది. ఈ బ్రిడ్జ్ జుహాయ్ మీదుగా వెళ్తుంది.

55 కి.మీ. పొడవున్న ఈ వంతెన నిర్మాణ పనులను 2009 డిసెంబర్‌లో ప్రారంభించారు. హాంకాంగ్, జుహాయ్ మధ్య ప్రయాణానికి 3 గంటల సమయం పడుతుంది.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

ఈ నెల 24 నుంచి ప్రజలు ఈ బ్రిడ్జ్‌పై యాణించవచ్చని గ‌తంలో అధికారులు ప్రకటించారు. అలాగే ఈ వంతెన మీదుగా 30 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీనిపై రోజూ సుమారు 29,100 వాహనాలు ప్రయాణించవచ్చు. 60 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి ఉపయోగించే ఉక్కును దీని నిర్మాణానికి ఉపయోగించారు.

కాగా, హాంకాంగ్ లో తన బలగాలను మోహరించేందుకు చైనా ఈ బ్రిడ్జ్ ను నిర్మించిందని పలు దేశాలు  అభిప్రాయపడుతున్నాయి. బ్రిడ్జ్ పై ప్రయాణించడానికి పలు ఆంక్షలు ఉన్నాయని అంటున్నారు.

మామాట: చైనా ఏం చేసినా సంచలనమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: