పిల్లల పెంపకంలో పెనుసవాళ్లు.. 

Share Icons:

పిల్లల పెంపకంలో పెనుసవాళ్లు.. 

 సృష్టిలో ఏ తలిదండ్రులకు బిడ్డలపై ప్రేమ లేకుండా ఉండదు. పురాణ కాలంలో ప్రహ్లాదుని తండ్రి  హిరణ్య కశ్యపుని నుండి  నేటి తరం పేరెంట్స్ వరకు ఎవరూ తమ బిడ్డలు వృద్ధి లోకి రావాలనే తప్ప చెడిపోవాలి, సమాజానికి హానికరంగా మారాలని కోరుకోరు. కాని వారి వారి పెంపకం లో ఉన్న వైరుధ్యాల వలన బిడ్డలు వివిధ రకాలుగా ఎదిగి తరువాత గొప్ప వారిగా లేదా నేరస్తులుగా మారే అవకాశం ఉంది. పిల్లల పెంపకంలో మన దేశంలో నేటి తరం అనుసరిస్తున్న విధానాలు సరయినవా అని ఒకసారి పరిశీలన చేసుకుంటే,   నిరశాజనకమైన పరిస్థితి కనిపిస్తుంది. మనకు కొంత కష్టమయినప్పటికీ ఒప్పుకొని తీరవలసిన నిజం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వలన కొంత వరకు మేలు జరిగిందన్నది నిజం.

 ప్రస్తుత కాలంలో నిరంతర వేగం, పోటీతత్వం, సంపాదన, త్వరగామారుతున్న  జీవన విధానంలో తలిదండ్రులు పిల్లలకు సరయిన న్యాయం చెయ్యలేక పోతున్నారు. ఉరుకులు పరుగులతో కష్టపడి పనిచేసి బిడ్డలకోసం డబ్బు సంపాదిస్తున్నారే తప్ప వారికి కావలసిన సమయాన్ని, అనురాగాన్ని కేటాయించలేక పోతున్నారు. డబ్బు వారికి మంచి జీవితాన్ని ఇస్తుందని భ్రమ పడుతున్నారు. పిల్లల పెంపకంలో జరుగుతున్న పొరబాట్లకు కారణాలు అనేకం. అనేక సామాజిక కారణాలవలన ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఆలస్యంగా, వయసు పైబడినతరువాత జరుగుతున్నాయి. వివాహం ఆలస్యమవటం వలన ప్రణాళిక లేకుండా పిల్లలను కనటం, సరయిన వనరులు లేకపోవటం, పిల్లల ఆలనాపాలన చూసుకోనేవారు లేకపోవటం, జీతాలకు పెట్టుకునే ‘ఆయా’ల పైన, డే కేర్ కేంద్రాలపైన ఆధారపడవలసి వస్తున్నది. పిల్లల పుట్టిన రోజులు జరుపుకోవటంలో ఉన్న శ్రద్ద వారిపెంపకంపై లేకపోవటం విచారకరం.

పిల్లల పెంపకం అంటే వారిని ఖరీదయిన స్కూల్ లో చేర్పించడం, ట్యూషన్ లు చెప్పించడం, ఖరీదయిన వస్తువులను కొనియ్యడం మాత్రమే కాదు. వారు తల్లి కడుపులో పడ్డప్పుడు నుండి పెంపకంలో సరయిన శ్రద్ధ అవసరం. గర్భవతి  అయిన స్త్రీ సరయిన ఆహారం తీసుకోక పోవడం పుట్టబోయే బిడ్డ ఎదుగుదల మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా తను గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కున్న పరిస్థితులు, మానసిక పరిస్థితుల ప్రభావం పుట్టబోయే బిడ్డపైన ఉంటుంది. గర్భధారణకు ముందు పేరెంట్స్ కు కౌన్సెలింగ్ అవసరం. ఈ కాలంలో సిజేరియన్లు విపరీతంగా పెరిగాయి. ఆ ప్రభావం భవిష్యత్తులో పిల్లల మానసిక పరిస్థితిపైన విపరీతంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. పూర్యం ఉమ్మడి కుటుంబాలలో తాత, నానమ్మ, పిన్ని, చిన్నాన్న, మేనత్త ఇలా అనేక బంధుత్వాలమధ్య పెరగటం వలన పిల్లలపై ఎవరో ఒకరు శ్రద్ద వహించే వారు. ఇప్పుడు ఆవిధమైన కుటుంబ వ్యవస్థ నగరాలలోనే కాదు చిన్న పట్టణాలలో కూడా కనిపించదు. ఇందుకు అనేక కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పోటీ ప్రపంచంలో ఆర్ధికంగా నిలద్రోక్కుకోవాలనే తపన ముఖ్యమయినది. తల్లి, తండ్రి ఇద్దరూ కూడా సంపాదిస్తే తప్ప ఆర్ధికంగా నిలద్రోక్కుకోలేని పరిస్థితి. ఫలితంగా పిల్లల పైన తలిదండ్రులు సరైన శ్రద్ధవహించలేక పోతున్నారు.

కుటుంబ నిర్వహణ ఖర్చులు, జీవన విధానం వేగంగా మారడం వలన తల్లి, తండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్తితి ఏర్పడిని. అందువలన పిల్లలపై శ్రధవహించే సమయం లేకపోవటం కారణగా తాత, నానమ్మలపైనానో, ఆయాల పైననో పూర్తిగా వదిలేయవలసి వస్తున్నది. తాత-నానమ్మల వద్ద పరవలేదుకానీ ఆయాలౌ,బేబీ కేర్ సెంటర్ళు వ్యాపార ధోఋఅని కావడం వలన.. అక్కడ పిల్లలపై తగిన అజమాయిషీ ఉండడంలేదు. తల్లి దండ్రులు తమకు సమయం దొరికినపుడు పిల్లలను అతి గారబం చెయ్యడం, అవసరం అయిన వాటికంటే ఎక్కువ సౌపాయాలు కల్పించడం వలన వారు మొండిగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు, ఈ రోజుకి కూడా మన దేశంలో మగ పిల్లవాడిని వంశోద్ధారకునిగా, ఆడపిల్లను బరువుగా భావించడం సర్వ సాధారణ మైపోయింది. ఆకారణంగా పిల్లల మానసిక పరిస్థితిలొ ఎదుగుదల కరవైంది.

అనుకర్రణ అనేది పిల్లలు నేర్చుకోనే విధానాలలో ముఖ్యమయింది. తల్లి దండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లి దండ్రులు  ఒక పని  వారు చేస్తూ దానిని పిల్లలతో వద్దు అని చెబుతూ ఉంటారు. ఉదాహరణకు తండ్రి సిగరెట్ తాగుతూ కొడుకుని తాగకూడదు అని చెబుతాడు. తల్లి టీవీ చూస్తూ పిల్లలను చూడకూడదని చెపుతుంది. పిల్లల్లు తల్లి దండ్రులు ఏమి చెప్పారో కాకుండా ఏమి అనుసరిస్తున్నారో వాటిని చేర్చుకుంటారు. తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చటం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలకు చాల ఇబ్బంది కరమయిన పరిస్థితి. నిజానికి ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఉండరు. ఏ ఇద్దరినీ పోల్చటం మంచిది కాదు.

పిల్లలను కనగానే వారిని పెంచే అవగాహన వచ్చినట్లుగా భావిస్తుంటారు. పిల్లలను పెంచడం అతి క్లిష్టమయిన విషయం. సరైన శిక్షణ, ఓర్పు ఏంతో అవసరం. ఆ మార్గంలో తలిదండ్రుక దీటైన కౌన్సెలింగ్ చాల అవసరం. కాని మన దేశంలో అటువటి విధానాలు, సదుపాయాలు ఎక్కువగా కనిపించవు. అంతే గాక ప్రసారమాధ్యమాల ప్రభావం పిల్లలపై పెద్దగ పడడాన్ని గమనించాలి. అవి ఒకవిధంగా సమాజానికి మంచి చేస్తున్నా, మరో విధంగా హాని కలిగిస్తున్నాయి. తలిదడ్రులకు సమయంలేక పోవటం, సహనం నశించడం వలన పిల్లలు టీవీ, వీడియొ గేమ్స్, ఇంటర్నెట్ వైపు ఆకర్షితులవుతున్నారు.  పెద్దవారు తాము సీరియల్స్ చూడటం కోసం పిల్లలను కూడా ప్రోత్సహిస్తారు. పిల్లలు ఆ పాత్రలను అనుకరింస్తూ ఎన్నో నష్టాల పాలవుతున్నారు.

స్కూళ్ళలో ఆట స్థలాలు లేక పోవటం. చిన్నవయస్సులో వారికి ఇష్టపడేవి కాకుండా, ఎక్కువ సంపాదనకు అనువయిన చదువుల లక్ష్యంతో   ఒత్తిడి చేయటం ఒక కారణం.. సృజనాత్మక విలువలు క్షీణించడం, సమాజంలో ద్వంద్వప్రమాణాల ప్రభావం పిల్లలపై పైచేస్తున్నాయి. పిల్లలపట్ల ఆసక్తి, వారి ఉద్దేశ్యం మంచిదే అయినా అనుసరిస్తున్న అనుసరిస్తున్న విధానాలలో లోపాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు అందరు కూడా మూలల నుండి మార్పుకు కృషి చెయ్యాలి. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లను భాధ్యతాయుత  పౌరులుగా తీర్చి దిద్దటం ప్రధమ కర్తవ్యం.

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply