చిలకలూరిపేట పోరు: సీనియర్ వర్సెస్ జూనియర్..

Share Icons:

గుంటూరు, 22 మార్చి:

ఈసారి చిలకలూరిపేటలో ఆసక్తికరమైన ఫైట్ జరగనుంది. ఇక్కడ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి తెదేపా తరుపున బరిలో ఉండగా.. మొన్నటివరకు టీడీపీలో ఉండి…ప్రత్తిపాటి వెనుక నడిచిన విడదల రజనీ వైకాపా నుండి పోటీ చేస్తుంది. దీంతో తన వెనుకే తిరిగి వైసీపీ నుండి తనపైనే పోటీ చేస్తున్న రజనీని ఎలా అయిన ఓడించాలని ప్రత్తిపాటి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అటు రాజధాని ప్రాంతానికి దగ్గర ఉండటంతో చిలకలూరిపేట అభివృద్ధి పథంలో నడిచింది. అలాగే ఆర్ అండ్ బి సహకారంతో రోడ్ల నిర్మాణం జరిగాయి. సంక్షేమ పథకాలు ప్రజలకి అందాయి. కానీ అధికారిక వ్య‌వ‌హారాల్లో మంత్రి భార్య జోక్యం ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. తాగునీటి విష‌యానికొస్తే అవ‌స‌రాలు తీర్చ‌డానికి వంద ఎక‌రాల చెరువు ఉన్నా ఉప‌యోగంలోకి తెచ్చే విష‌యంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందని టాక్ ఉంది. పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదనే విమర్శలు ఉన్నాయి.

మరోవైపు మూడు సార్లు ప్రత్తిపాటికి ప్రత్యర్ధిగా ఉన్న మర్రి రాజశేఖర్ ఈ సారి ఎన్నికల పోరు నుండి తప్పుకున్నారు. దీంతో తెదేపా నుండి వచ్చిన రజనికి జగన్ చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. టికెట్ రావడమే ఆలస్యం ఆమె నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. అటు నియోజకవర్గంలోనూ సీనియర్లను కలుసుకుని వారి ఆశీస్సులు పొందుతున్నారు. కానీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వర్గం రజనీకి ఎంతవరకు సహకరిస్తుందనేది చూడాలి. ఈ నియోజకవర్గంలో బీసీలు, కమ్మ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. వీరు లక్ష పైనే ఉండొచ్చు. ఆ తర్వాత ఎస్సీలు 50 వేలు,ముస్లింలు 43వేలు ఎక్కువ ఉన్నారు. అయితే బీసీలు, కమ్మ, ఎస్సీ, ముస్లింలు గెలుపుని డిసైడ్ చేయనున్నారు.

మరి చూడాలి చిలకలూరిపేటలో సీనియర్ గెలుస్తారో..జూనియర్ గెలుస్తారో…

మామాట: ప్రజలకి సేవ చేసేవారు ఎవరైనా గెలుస్తారు…

Leave a Reply