వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: చంద్రబాబు

Share Icons:

ఏలూరు, 8 జనవరి:

‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన జన్మభూమి సభలో ‘వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించారు.

రాష్ట్రంలో వ్యవసాయంపై 60, 70 శాతం ప్రజలు జీవిస్తున్నారని, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ కొత్త విధానాలతో ముందుకు సాగుతోంది’ అని చంద్రబాబు తెలిపారు.

ప్రపంచంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.

అదేవిధంగా వాణిజ్య పంటలు అయిన మిరియాలు, వక్కలు, కోకో, పామాయిల్‌, కొబ్బరిలాంటి పంటలను మరింతగా సాగు చేయాలన్నారు. అలాగే చేపల చెరువుల్లో కాలుష్యాన్ని అరికట్టాలని, కాల్వలను కలుషితం చేయడం తగదని అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని, కుదిరితే తగ్గిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, జవహర్‌, ఎంపీలు మాగంటి బాబు, మురళీమోహన్‌, తోట సీతారామలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

chandrababu at polavaram project

అయితే జన్మభూమి కార్యక్రమం కంటే ముందుగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించి ఎగువ కాఫర్ డ్యాం, రూ.25 కోట్ల విలువైన అగ్రిటెక్ కూలింగ్ మిక్చర్ ప్లాంట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ నెలలోనే పోలవరంకు ఒక గేటును కూడా ఏర్పాటు చేయబోతున్నామని, డయా ఫ్రమ్ వాల్ జూన్ నాటికి పూర్తి కానుందని ఆయన అన్నారు.

మామాట: మరి ఇప్పటివరకు వ్యవసాయ రంగం ఎంతవరకు పురోగతి సాధించిందో?

English Summary: Chief Minister Chandrababu visited the West Godavari district on Monday as part of Janmabhoomi-maa vooru’ program. Speaking on the occasion, he addressed the topic “Development of Agriculture and Allied Sector” in the program. Chandrababu said the Government is continuously working towards the development of agriculture and is pursuing new policies.

Leave a Reply