ఇస్రోకి ముఖ్యమంత్రి అభినందనలు…

Share Icons:

నెల్లూరు, 12 జనవరి:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన‌ మైలురాయి సాధించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రంనుంచి  వందో ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించి విజ‌య‌వంతంగా క‌క్ష్యలోకి ప్రవేశ‌పెట్టడం గర్వకారణం అని ఆయన అన్నారు.

ప్రయోగం విజయవంతం కావడానికి శ్రమించిన శాస్త్రవేత్తలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

ఇస్రోఈరోజు ఉదయం 9.29 గంటలకు  పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్ర‌వేశ‌పెట్టి భారత కీర్తి పతాకను మరో మారు విశ్వ వ్యాప్తి చేసింది. భార‌త్ త‌న వందో ఉప‌గ్రహాన్నికక్ష్యలోకి ప్ర‌వేశ‌పెట్టడాన్ని ప్రపంచ దేశాలు ఆస‌క్తిగా గ‌మ‌నించాయి.

గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించి ఇస్రో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. ఈ దఫా మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగించి మరో మారు అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత సత్తా ప్రపంచానికి చాటింది.

మామాట: ప్రపంచ కీర్తిగడిస్తున్న ఇస్రో 

English summary: Chief Minister Chandrababu expressed happiness over the Indian Space Research Organization (ISRO) to achieve another rare milestone. The Chief Minister congratulated all scientists who worked hard to succeed.

Leave a Reply