చీఫ్‌ జస్టిస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు! 

Share Icons:

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 20,

చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్ పై లైంగిక ఆరోపణలు వచ్చినట్లు సొలసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఐతే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్ కొట్టిపారేశారు. దీనిపై చర్చించడానికి, ఇవాళ సుప్రీంకు చెందిన త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైంది. న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉందని చీఫ్‌ జస్టిస్‌ అన్నారు.

త్రిసభ్య ధర్మాసనంలో గగోయ్ తో పాటు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలున్నారు. హుటాహుటిన సుప్రీం స్పెషల్‌ సిట్టింగ్‌ ఏర్పాటు చేసింది. ఇలాంటి ఆరోపణలకు స్పందించేందుకు మరింత దిగజారదలుచుకోలేదని గగోయ్ అన్నారు.

20 ఏళ్లు నిస్వార్థంగా సేవచేసినందుకు ఇదా ఫలితం అని ఆవేదన చెందారు. తనను ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచీ తప్పించడానికే ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయని. వచ్చే వారం కొన్ని ముఖ్యమైన కేసులు విచారించాల్సిన నేపథ్యంలో ఈ ఆరోపణ రావడం దారుణమన్నారు.

 

మామాట: ఏమిటో ఈ వింత పరిస్థితి.. దేవుడా!

Leave a Reply