తిరుపతి, జనవరి 14,
[pinpoll id=”68058″]
పందెం జూదంలో భాగం. మా పెద్దలంతా ఆడుతుండేవారు.. మేమూ ఆడుతామంటే… జూదాన్ని అనుమతించవచ్చా. గతంలో జరిగినవాటిని ఇపుడు మనం ఆమోదించడం మొదలు పెడితే… బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం వంటివి కూడా గతంలో ఉన్నవే కదా, వాటినీ అమలు చేసుకుందామా.. ఏదో పండగ, ఒక్కరోజే కదా కోడి పందేలంటే… ఏమిటి ఒక్క రోజులోనే దాదాపు రూ. 2000 కోట్లు చేతులు మారుతోంది కదా. ఏమంటారు. కోడిపందేల కారణంగా సంక్రాంతి కళ తప్పి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జూదం ఉంటే.. మధ్యం కూడా వుంటుంది. ఇంకా వడ్డీ వ్యాపారులుంటారు. వేశ్యాశిఖామణులు కూడా దరిదాపుల్లోనే ఉంటారు. ఇలా పండగ పేరుతో అవలక్షణాలను ప్రోత్సహించవచ్చా. రాష్ట్రమంత్రులే స్వయంగా పందెం బరులలో దిగే పాలక పార్టీ తీరుతెన్నులు చట్టాలను గౌరవించినట్టా… ఏమిటిది. పోలీసులు చూసీ చూడనట్టు ఉండడంలోని మతలబేమిటి.
మామాట: బెట్టింగ్ నేరమైనపుడు కోడి పందెం నేరం కాదా..