పోలీసులును చూసి పరారు…బావిలో పడి ఇద్దరు మృతి

Share Icons:
 విజయవాడ, జనవరి 11 ,
కోడి పందాలు రెండు నిండు ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన చాట్రాయి మండలం చిత్తాపూర్ గ్రామంలో జరిగింది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రలో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. ఈ  క్రమంలో చిత్తాపూర్ గ్రామంలో కూడా గురువారం అర్ధరాత్రి కోడి పందాలు నిర్వహించారు. .సమాచారం అందుకున్న పోలీసు లు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను చూసిన సుమారు 20 మంది పారిపోతుడగా ఇద్దరు వ్యక్తులు అక్కడి పోలాల్లో వున్న నేలబావిలో పడి పోయారు.
బావిలోని బండరాళ్లు తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు విస్సన్నపేట మండలం కొండపర్వకు చెందిన నక్కలా చెన్నకేశవరావు,(26), చిత్తపూరు గ్రామానికి చెందిన చిట్నూరు చెన్నకేశవరావు(20)లుగా గుర్తించారు. అగ్నిమాపక దళ౦ శుక్రవారం ఉదయం బావి నుంచి మృతదేహాలు ను వెలికితీశారు. దీనిపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మామాట:  పేకాటా ఆడకూడదు, జల్లికట్టూ వద్దు… కోడి పందేలు కూడా కాదంటే ఎట్టా సామీ…

Leave a Reply