TRENDING NOW

పూజారా ఒక్కడే నిలిచాడు…భారత్ 250/9.

పూజారా ఒక్కడే నిలిచాడు…భారత్ 250/9.
views:
3

ఆడిలైడ్, 6 డిసెంబర్:

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో నయావాల్ పూజారా అద్భుతమైన సెంచరీ చేయడంతో భార‌త్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది.

ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 56 ర‌న్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టుని పూజారా(123 ; 7×4, 2×6) త‌న సెంచ‌రీతో ఆదుకున్నాడు.

ఈ సెంచ‌రీతో కెరీర్‌లో 16వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు పుజారా. లంచ్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ (37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిష‌బ్ పంత్ (25; 2 ఫోర్స్‌, 1 సిక్స్) వంటి టాప్ బ్యాట్స్‌మెన్స్ వికెట్స్ కోల్పోయిన‌ప్ప‌టికి అశ్విన్ ( 25 ; 1×4)తో క‌లిసి స్కోరు బోర్డ్‌ని ప‌రుగులెత్తించాడు.

అయితే ఈ రోజు ఉద‌యం ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో షమీ (6), బుమ్రా (0) ఉన్నారు . ఆస్ట్రేలియా బౌల‌ర్స్‌లో హాజిల్‌వుడ్‌, క‌మిన్స్ , లియాన్‌కి రెండు వికెట్స్ ద‌క్కాయి.

మామాట: పూజారా కూడా నిలబడకపోతే భారత్ స్కోర్ ఎంత ఉండేదో..

(Visited 11 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: