‘పూజారా’ని కూడా గుర్తించండి: గంగూలీ

Share Icons:

కోల్‌కతా, 22 మార్చి:

టెస్ట్ మ్యాచ్లో పుజారాలాంటి ఆట‌గాడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయ‌డం వలన కోహ్లికి ఎంతో క‌లిసొస్తోంద‌ని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ అభిప్రాయ‌పడ్డాడు.

బుధవారం కోల్‌కతా లో గంగూలీ రాసిన ఆటొబయోగ్రఫీ బుక్ ‘ఏ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్’ ని క్రికెటర్లు వీవీస్ లక్ష్మణ్, పూజారా, హర్భజన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ… కెప్టెన్ కోహ్లీ వరుస శతకాలు చేస్తూ, ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపిస్తున్నాడని అన్నాడు.

దీని వలన క్రికెట్ అభిమానులను కోహ్లీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ మాత్ర‌మే కాదు మ‌రో ఉత్త‌మ ఆట‌గాడు పూజారాను కూడా గుర్తించాల‌ని అన్నాడు.

మూడో స్థానంలో ఉత్త‌మ బ్యాట్స్‌మెన్‌ను క‌లిగి ఉన్న జ‌ట్టే టెస్టుల్లో ఉత్త‌మంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

టీమిండియాకు ప్ర‌స్తుతం టెస్టుల్లో అలాంటి ఉత్త‌మ ఆట‌గాడు పుజారా అని, ముందు క్రీజ్‌లో కుదురుకుని ఆ త‌ర్వాత ప‌రుగులు చేస్తాడని కొనియాడాడు. బంతి పాత‌బ‌డేలా చేసి త‌ర్వాతి బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడేందుకు మార్గం సుగ‌మం చేస్తాడని, అత‌డు జ‌ట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడినా త‌గిన గుర్తింపు రాదని చెప్పాడు. ఇక మా తరంలో రాహుల్ ద్ర‌విడ్‌లా ఇప్ప‌టి జ‌ట్టుకు పుజారా ఉన్నాడ‌ని గంగూలీ అభిప్రాయ‌పడ్డాడు.

మామాట: ఇందులో కొంతవరకు వాస్తవం ఉందనే చెప్పుకోవాలి..

English summary:

Former India skipper Sourav Ganguly said on Wednesday that India’s Test specialist batsman Cheteshwar Pujara is as good as captain Virat Kohli when it comes to the five-day format.

Leave a Reply