హృతిక్ పై చీటింగ్  కేసు

Share Icons:

 చెన్నై, ఆగస్టు 28,

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పై చెన్నైలో కేసు నమోదైంది. వివరాలు.. చెన్నై లోని సన్ ఎంటర్ ప్రైజస్ సంస్థకు చెందిన స్టాకిస్ట్ ఆర్. మురళీధరన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హృతిక్, మరో 8 మంది పై  రూ. 21 లక్షల చీటింగ్ కేసునమోదు చేశామని పోలీసులు తెలిపారు. హృతిక్ సారథ్యంలోని మర్చండైస్ ప్రొడక్ట్స్ అనే సంస్థ నుంచి మురళీధరన్ వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నారు. అయితే మధ్యలో సదరు హృతిక్ సంస్థ మార్కెటింగ్ సిబ్బందిని  తొలగించడంతో తనకు భారీ నష్టం సంభవించిందని ఫిర్యాదిదారుడు తెలిపారు. దీనితో చెన్నై, కొండగైయూర్ పోలీసు స్టేషన్లో ఐపిసి 420 సెక్షన్ కింది కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మామాట:  వ్యాపారంలో ఇదో మలుపు అంతే.

Leave a Reply