ఇకపై తండ్రి ఆస్థుల్లోనే కాదు అప్పుల్లోనూ వాటా: హైకోర్టు తీర్పు

Share Icons:

మద్రాస్, 09 ఫిబ్రవరి:

భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా మద్రాసు హైకోర్టు నుండి ఓ సరికొత్త తీర్పు వెలువడింది. తండ్రి మరణానంతరం ఆస్థిపాస్తులే కాదు అప్పుల బాధలు కూడా పంచుకోవాల్సిందే అని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది.

తన తండ్రి మరణానంతరం ఓ పుత్రుడు చేసిన పనికి యావత్ రాష్ట్రానికి ఈ తీర్పు అమలు అయ్యింది.

అసలు ఏం జరిగిందంటే…

చాలాకాలంగా మద్రాసులో ఓ కేసు వివాదం నడుస్తోంది. ఓ ఇంటి పెద్ద వారి ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయిస్తుండగా.., శుభ్రం చేసే కార్మికుడు చనిపోయాడు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ముగురునీటిని శుభ్రపరుస్తూ ఎవరైనా చనిపోతే వారికి నష్టపరిహారం కింద 10 లక్షలు చెల్లించాలి.

తర్వాత ఆ ఇంటి పెద్ద మరణించడంతో ఆ కుటుంబానికి చెల్లించాల్సిన నష్టపరిహారం అతని తనయుడు చెల్లించకుండా మొండి చెయ్యి చూపించాడు.

దీనితో విస్తు చెందిన కార్మికుడి కుటుంబం కేసు పెట్టారు. ఇక దీని గురించి ఎన్నో ఏళ్ళు నలిగిన తర్వాత ఆ తండ్రి వారసుడే నష్టపరిహారం చెల్లించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.

చెన్నైలోని సైదాపేటలో సదరు కార్మికుడు మరణించి 17 ఏళ్లయిన తర్వాత ప్రస్తుతం కోర్టు ఈ మేరకు తీర్పునివ్వడం గమనార్హం.

తీర్పు సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మాట్లాడుతూ… మన పురాణ ధర్మశాస్త్రాల్లో నైతిక బాధ్యతల ప్రస్తావన ఉందని, ఆ ప్రకారం, రుణం చెల్లించకపోవడం పాపం కిందకు వస్తుందన్నారు.

అది పై లోకంలో తీవ్ర నరకానికి గురిచేస్తుందని చెప్పారు.

రాముడు తన తండ్రి మాటకు కట్టుబడిన రీతిలో పిటిషనర్‌ బాధిత కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే సదరు కార్మికుడు ఆగస్టు 26, 2001న మరణించగా.. అతని వారసురాలు ఆదిలక్ష్మీకి రూ.10 లక్షల పరిహారాన్ని చెల్లించాలంటూ ఆగస్టు 21, 2017న చెన్నై కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఆ ఆదేశాన్ని సవాలు చేస్తూ ఎ.రవిచంద్రన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

కాగా, బాధిత కుటుంబానికి తమ తండ్రి ఎప్పుడో పరిహారం చెల్లించాడని పిటిషనర్ వాదించాడు.

నిజానికి ఘటన జరిగిన తర్వాత 15 ఏళ్ల వరకు ఆదిలక్ష్మీ మౌనంగానే ఉన్నదని, కానీ 2016లో చెన్నై కార్పొరేషన్ ఆమె తరపున నష్టపరిహారం కోరిందని, ఇదంతా తర్వాత పుట్టిన ఆలోచన అని పిటిషనర్ వాదించాడు.

అందువల్ల కార్పొరేషన్ ఆదేశాన్ని కొట్టివేయాలంటూ కోర్టును కోరారు.

కానీ, కోర్టు ఆయన విన్నపాన్ని తోసిపుచ్చుతూ మరో 2నెలల్లో మొత్తం పరిహారాన్ని బాధిత కుటుంబానికి చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పింది.

మామాట: ఏదైతేనేం బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది హైకోర్టు

English summary:

Madras High Court on Thursday directed a son to pay the unpaid compensation to the family of the deceased.

Leave a Reply