తిరుపతి, మే 14,
కొంతమంది వ్యాపారులు డబ్బు ఆశతో మామిడికాయలనే తీసుకొచ్చి కార్బైడ్‌తో పండించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగా మార్కెట్లో ఎక్కువగా కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. వీటిని అసలు గుర్తించాలో చూద్దాం.. సమ్మర్ రాగానే చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడిపండ్లు తింటారు. ఓ రకంగా చెప్పాలంటే వీటికోసం ఏడాదిపొడవునా ఎదురుచూస్తుంటారు.
అందుకే ఈ ఫ్రూట్‌ని పండ్ల రారాజు అంటారు. అయితే, కొంతమంది వ్యాపారులు డబ్బు ఆశతో మామిడికాయలనే తీసుకొచ్చి కార్బైడ్‌తో పండించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగా మార్కెట్లో ఎక్కువగా కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. వీటిని అసలు గుర్తించాలో చూద్దాం..
* పండ్లపై తెల్లని పొర కనిపిస్తుంటే అవి ఖచ్చితంగా కార్బైడ్ వేసి పండించిన పండ్లేనని గుర్తించొచ్చు.
* కార్బైడ్‌తో పండించిన పండ్లు తేలిగ్గా ఉంటాయి. మామూలు పండ్లతో పోల్చితే ఇవి తక్కువ బరువుంటాయి. కాబట్టి నీటిలో వీటిని వేసినప్పుడు పైకి తేలుతాయి.
* కార్బైడ్ వేసి పండించిన పండ్లు చూడ్గానికి పండినట్లున్నా.. గట్టిగానే ఉంటాయి. సహజంగా పండిన పండ్లు లా కాదు.. మెత్తగా ఉంటాయి.. తొడిమల దగ్గర మంచి వాసన వస్తుంది.
* అదేవిధంగా.. సహజంగా పండినపండ్లు మొత్తం ఒకే రంగులో ఉంటాయి. కార్బైడ్‌తో పండించిన పండ్లు కలర్ ఒక్కో చోట ఒక్కోరంగులో ఉంటాయి.
* కార్బైడ్ వేసి పండించిన పంటలు రుచిలోనూ, రంగులోనూ అన్నింట్లోనూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కార్బైడ్ వేసిన పండ్ల రుచి అంతగా బాగోవు.
మామాట: ఆదాయం ముందు ప్రజారోగ్యం గుండు సున్నా కదా