శ్రీధర్‌తో కలిసి ఆ కోరిక తీర్చుకున్న ఛార్మి..!!

Share Icons:

హైదరాబాద్, 19జనవరి:

అందాల నటి ఛార్మికి సడన్‌గా ఓ కోరిక కలిగిందట. రాత్రి పూట హైదరాబాద్ వీధుల్లో బైక్‌పై చెక్కర్లు కొట్టాలని..

దీంతో, షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఆమె… అనుకున్నదే తడవుగా ఎవరూ గుర్తు పట్టకుండా ఫేస్‌ను కవర్ చేసుకుని బైక్‌పై రైడ్ చేసింది.

charmy night ride

ప్రస్తుతం ఛార్మి పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న మెహబూబా సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తోంది. తాజాగా ఛార్మి హైదరాబాద్‌లో మెహబూబా షూటింగ్ ముగిసిన అనంతరం రాత్రి సమయంలో బైక్‌పై హైదరాబాద్ వీధులన్నీ చుట్టేసేందుకు ప్లాన్ చేసింది.

వెంటనే తన కో-ఆర్డినేటర్ శ్రీధర్‌తో కలిసి బైక్‌పై తనను గుర్తు పట్టకుండా ఫేస్‌ను కవర్ చేసుకుని బయల్దేరింది. వీరిద్దరూ మధ్యలో స్ట్రీట్ ఫుడ్ కోసం ఓ బండి దగ్గర ఆగినపుడు..

అక్కడ తన సీక్రెట్ జాయ్ రైడ్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘హైదరాబాద్ వీధుల్లో బైక్ రైడ్… విత్ శ్రీధర్’ అని ట్వీట్ చేసింది.

మామాట: ఆఫర్లు లేనప్పుడు ఆ… సరదానైనా తీర్చుకుంది.. పాపం 

English Summary: Tollywood actress charmi has a desire to ride on bike at night times in Hyderabad so; she fulfilled it with coordinator Sridhar.

Leave a Reply