మతం మారితే రిజర్వేషన్ రాదు : మద్రాస్ హైకోర్ట్

Share Icons:

ఒక మతంలో వెనుకబడిన, అత్యంత వెనుక బడిన, షెడ్యూలుకులాలకు చెందిన వ్యక్తి ఆ మతం నుంచి మరో మతంలోకి మారితే అతని కులం కూడా రద్దవుతుందని మద్రాస్ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు ప్రకటించింది.  వెనుకబడిన తరగతులకు చెందిన, మతం మారిన మహిళ ఒకరు దాఖలు చేసుకున్న కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్.. మతం మారిన వారికి అత్యంత వెనుక బడిన కులం హౌదా ఉండదు, మతం మారడం వలన కులం రాదు, పుట్టుకతో వస్తుందని పేర్కొన్నారు.

ఒక ఓసీ కులానికి చెందిన వ్యక్తి ఇస్లాం మతంలోకి మారి, తనకు వెనుకబడిన తరగతి హోదా ఇవ్వమంటే ఎలా కుదురుతుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిని అనుమతిస్తే సాంఘిక వెనుకబాటు తనాన్ని నిర్ణయించే పద్దతి దెబ్బతింటుంది, వ్యక్తుల ఇష్టాల మేరకు అది నిర్ణయించబడే పరిస్థితి వస్తుందన్నారు. అందువలన మతం మారడం వలన అప్పటికే ఆ మతంలో జన్నించిన వారికి ఉండే హక్కులను ఇతరులు పొందలేరని న్యాయమూర్తి తెలిపారు.

ఈ మేరకు 1952లో మద్రాసు హైకోర్టు ఒక హిందువు  కులాలు లేనటువంటి ఇతర మతంలోకి మారి, పాత కులాన్ని మాత్రం అలాగే ఉంచుకుంటానంటే కుదరదన్న తీర్పును సుప్రీం కోర్టు దృవీకరించిందని గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి క్రిస్టియన్ నాడార్ వర్గానికి చెందిన దంపతులకు జన్మించిన ఎస్. యాస్మిన్ అనే యువతి ముస్లీం యువకున్ని వివాహం చేసుకుని, ఇస్లాం మతం స్వీకరించింది. కాగా ఆమెకు 30 ఏళ్లు వచ్చిన తరువాత గ్రూప్ 4 ప్రభుత్వ ఉద్యోగానికి వయోపరిమితి సడలించాలని అధికారులను కోరగా, మతం మారినందున ఆమె ను ఇతర తరగతుల కింద పరిగణిస్తామని, వయోపరిమితి సడలించడం కుదరదన్నారు. దీనిపై యాస్మిన్ కోర్టునాశ్రయించగా, న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ పై తీర్పు వెలువరించారు.

 

మామాట:మతం వద్దు-కులం ఇచ్చే రిజర్వేషన్ ముద్దు .

Leave a Reply