420 తాతయ్య…అందులో రెండు శాతం జె-ట్యాక్స్ అంటగా…

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి:

రోజు తెలుగుదేశం పార్టీపై , చంద్రబాబుపై విమర్శలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ఏపీ ప్రభుత్వం అమలుచేయతలపెట్టిన మద్యనిషేధంపై విమర్శలు గుప్పించారు. కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలను వైసీపీ నాయకులకు చెందిన షాపుల్లోనే నెలకొల్పుతున్నారని, జగనన్న మద్యం దుకాణాల్లో వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇస్తున్నారని బుద్ధా ఆరోపించారు.

ఇక్ నూతన మద్యం దుకాణాల్లో ఏదైనా కంపెనీకి చెందిన బ్రాండ్ అమ్మకానికి పెట్టాలంటే 2 శాతం J-ట్యాక్స్ తప్పనిసరి అని ట్వీట్ చేశారు. సూపర్ గా ఉంది 420 తాతయ్యా మీ మద్యపాన నిషేధం స్కామ్ అంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై సెటైర్ వేశారు.

అలాగే మరో ట్వీట్ లో వైయస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని 420 తాతయ్య విజయసాయిరెడ్డి చెబితే అర్థం చేసుకోలేకపోయామని అన్నారు. ‘మీరు దొంగ లెక్కలే కాదు… మర్డర్ డైరెక్షన్ లో కూడా ఆరితేరిపోయారని అర్థమైంది. ఆ హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య వెనుక మర్మమేంటో చెప్తావా తాతయ్యా?’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ బాబాయ్ ను ఎవరు చంపారు? అని ప్రశ్నించారు. #WhoKilledBabai అనే ట్యాగ్ ను జతచేశారు.

మరోవైపు చంద్రబాబు, లోకేశ్ లు కూడా ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపించారు. ఇసుకపై చంద్రబాబు ట్వీట్ చేయగా, గోపాలమిత్రల సమస్యపై లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కొరతను సృష్టించారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇసుకను తవ్వడం దగ్గర నుంచి తరలించడం, నిల్వచేయడం, అమ్ముకోవడం అంతా అక్రమమేనని ఆరోపించారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని… అందుకే ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నిర్మాణరంగంలో కార్మికులుగా పని చేస్తున్న ఎంతో మంది కష్ట జీవులకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. పార్టీలోని వ్యక్తులను మేపడం కోసం బడుగువర్గాలను పస్తులుంచడం దుర్మార్గమని అన్నారు.

అలాగే అధికారం కోసం ఎన్నికల సమయంలో జగన్ పలు హామీలు ఇచ్చారనీ, అప్పుడు గుర్తుకురాని టెక్నికల్ పాయింట్లు ఇప్పుడెందుకు గుర్తుకు  వస్తున్నాయని ప్రశ్నించారు. గోపాలమిత్రలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను జగన్ పరిశీలించాలని సూచించారు. ఇన్నాళ్ళూ రైతులకు సహాయకారులుగా ఉంటూ పాడి పరిశ్రమాభివృద్ధికి గోపాల మిత్రలు కృషి చేశారని లోకేశ్ తెలిపారు. దశాబ్దాలుగా వాళ్ళ సేవలను ఉపయోగించుకుని ఇప్పుడు అర్హతలు లేవంటూ వాళ్ళను పక్కనపెట్టడం సరికాదని హితవు పలికారు. ఏళ్ళ కొద్దీ సేవచేసినా వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది లేకపోతే ఎలా? అని నిలదీశారు. గోపాలమిత్రల సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలనీ, లేదంటే తన మాటలు, హామీలకు విశ్వసనీయత లేదని ముఖ్యమంత్రి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply