ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు

Share Icons:
అమరావతి, జనవరి 12,
ప్రధాని మోడీకి  సీఎం చంద్రబాబు శనివారం ఐదు పేజీల లేఖ రాసారు. జగన్ పై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు కు అప్పగిస్తూ హోమ్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అయన లేఖలో తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. 2008 ని చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ, సరిహద్దు సమస్యలు, టెర్రరిస్ట్ కేసులు మాత్రమే ఎన్ఐయే కు అప్పగించాలి. 2009 లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ఐఏ పై మోడీ చేసిన వ్యాఖ్యలను లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 2011 లో ఎన్ఐయే పై బీజేపీ చేసిన  తీర్మానాన్ని లేఖలో పేర్కొన్నారు.
982 పౌర విమానయాన చట్టం ప్రకారం ఈ కేసు ఎన్ఐయే పరిధిలోకి రాదు. ఎన్ఐయే  విచారణలో కేంద్రం ఒత్తిడి ఉంటుందని గతంలో ఒక న్యాయవాది ఇంటర్వ్యూ లో చెప్పారు. జగన్ పై దాడి  జరిగినప్పుడు కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారని అయన లేఖలో పేర్కోన్నారు. హోమ్ శాఖ అదేశాలిచ్చిన 24 గంటల్లోపే ఎన్ఐయే  ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసింది. ఇద్దరు ఎమ్యెల్యే లు దారుణంగా హత్య గావింపబడితే కేంద్రం పట్టినచుకోలేదు. కానీ చిన్న దాడి కేసును మాత్రం ఎన్ఐయే కు అప్పగించిందని అన్నారు. కేంద్ర హోమ్ శాఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో ప్రధానిని చంద్రబాబు కోరారు.
మామాట:  లేఖలతో పనులుజరుగుతాయా. . . 

Leave a Reply