చంద్రబాబు ఉండవల్లికి ఇచ్చిన ఆఫర్ ఇదేనా?

Chandrababu what is the offer given to undavalli
Share Icons:

అమరావతి, 17 జూలై:

ఉండవల్లి అరుణ్ కుమార్…రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు….ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకుండా గట్టిగా ప్రయత్నించిన నేతల్లో ఈయన ముందు వరుసలో ఉంటారు.

అలాగే ఏపీ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూనే…టీడీపీని, చంద్రబాబుని ముప్పుతిప్పలు పెట్టిన నాయకుడు. అయితే అలాంటి నేత రాష్ట్ర విభజన జరిగాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉంటున్నారు. కానీ ఏ పార్టీలేకున్నా అజ్నాతంలోకి వెళ్లకుండా అప్పుడప్పుడు మీడియా ముందుకి వచ్చి సమయానికి తగ్గట్టు అప్పుడు జరిగే రాజకీయ పరిణామాలపై సెటైర్లు వేస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా ఉండవల్లి తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. అసలు తనకి పూర్తి విరుద్ధ రాజకీయ నాయుకుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. కాకపోతే వీరి భేటీకి కూడా కారణం లేకుండా పోలేదు.

విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై గతంలో చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం ఆహ్వానం మేరకు సచివాలయానికి వచ్చిన ఉండవల్లి పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరు, కేంద్రంపై అవిశ్వాసం వంటి అంశాలపై చంద్రబాబుకి సలహాలు ఇచ్చారు.

పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబుకు ఉండవల్లి గుర్తుచేశారు. వాటిని ఆయుధంగా చేసుకునే పార్లమెంట్‌లో పోరాడాలని చెప్పినట్లు ఉండవల్లి చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో చెప్పారు.

ఈ నేపథ్యంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి చంద్రబాబును కలవడం ఆసక్తిని రేపింది. ఇక ఈ భేటీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. కేవలం పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన విషయం గురించే వీరు మాట్లాడుకున్నారా..లేక వేరే కారణాలు ఉన్నాయా అని అనుమానాలు రేకెత్తాయి. అయితే టీడీపీ పార్టీ వర్గాలు మాత్రం ఉండవల్లి పార్టీ చేరుతున్నారని అందుకే ముఖ్యమంత్రిని కలిశారు అని చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఉండవల్లికి చంద్రబాబు ఆఫర్….

మరికొందరు అయితే బాబు..ఉండవల్లికి ఓ ఆఫర్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు…అది కూడా మొన్నటివరకు పరకాల ప్రభాకర్ నిర్వర్తించిన ఏపీ మీడియా సలహాదారు పోస్టులోకి రమ్మన్నారని సమాచారం. అంతకముందు కేంద్రం నుండి  మంచి ఆఫర్లు వచ్చిన వాటి జోలికి పోలేదు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ఆఫర్‌కి ఒకే చెబుతారా? లేదా పార్టీలో చేరుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆయన తాను అన్నీ పార్టీలకి సమాన దూరంలో ఉన్నానని చెబుతున్నాడు. మరి ఇటువంటి సమయంలో ఉండవల్లి ఎటువైపు వెళ్తారు అనేది ఆసక్తికరమైన విషయమే…

మామాట: ఉండవల్లి…ఏంటయ్యా నీ రాజకీయం

Leave a Reply