ముద్దన్న పార్థివదేహానికి చంద్రబాబు నివాళి..!!

Share Icons:

చిత్తూరు, 7 ఫిబ్రవరి:

అనారోగ్యంతో మృతిచెందిన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు భౌతికకాయం హైదరాబాద్ నుంచి స్వగ్రామం రామచంద్రాపురం మండలం వెంకట్రామపురంలోని ఆయన నివాసానికి చేరుకుంది.

ముద్దుక్రిష్ణమనాయుడు భౌతికకాయాన్ని చూడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో  బయలుదేరి ఈ మధ్యాహ్నం 2.15కు తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు.

chandrababu at renigunta airport

అనంతరం… రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా కాన్వాయ్‌లో రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామాపురం వెళ్లారు.

అక్కడ  ఎమ్మెల్సీ స్వర్గీయ ముద్దుకృష్ణమ పార్థివదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ముద్దుకృష్ణమ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని, నిరంతరం ప్రజల కోసం పరితపించారని చంద్రబాబు కొనియాడారు.

పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు గాలి భౌతికకాయానికి నివాళులర్పించారు. గురువారం అధికారిక లాంఛనాలతో గాలి అంత్యక్రియలు జరగనున్నాయి.

ముద్దుకృష్ణమ నాయుడ్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు.

మామాట: పార్టీకే కాదు పార్టీ అధినేతకూ ఇది తీరని లోటే….

English Summary:

AP CM Chandrababu landed at Renigunta airport along with ministers devineni uma, narayana, achennayudu and from there by road they went to venkatapuram to visit TDP MLC gali muddu krishnama naidu dead body who passed this morning in Hyderabad at care hospital.

Leave a Reply