బాబు విశాఖ టూర్: టీడీపీ వర్సెస్ వైసీపీ రచ్చ

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

విశాఖపట్నం: మూడు రాజధానుల నిర్ణయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ మొదలైంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును వైజాగ్‌లో అడుగుపెట్టనీయబోమని వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు చంద్రబాబుకు వెల్‌కమ్ చెప్పేందుకు టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలిచ్చాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పోలీసు రంగంలోకి చెదరగొట్టారు. ముందుజాగ్రత్తగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. వైసీపీ, టీడీపీ ఆందోళనల నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆయన కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్‌‌పై విసిరిన గుడ్లు అదుపుతప్పి పోలీసులపైన పడ్డాయి. ఎయిర్‌పోర్టులోకి వైసీపీని ఎలా అనుమతిస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కారులో నుంచి ఎమ్మెల్యే అనుచరులను దించి అక్కడి నుంచి పంపించారు. కాగా, చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా పెందుర్తి వెళ్లాలని టీడీపీ భావించింది. కానీ ర్యాలీకి విశాఖ పోలీసులు అనుమతించలేదు. పెందుర్తి భూసమీకరణ బాధితులను పరామర్శించే కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులను మాత్రమే మంజూరు చేసింది. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, ఇతర నేతలు 50 మందికి మించి ఉండరాదని స్పష్టం చేశారు. ఐతే టీడీపీ నేతలు మాత్ర ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

 

Leave a Reply