వల్లభనేని వంశీ టార్గెట్: చంద్రబాబు బీసీ అస్త్రం…

vallabhaneni vamsi confirm to leave tdp and he not join in ysrcp
Share Icons:

అమరావతి: 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వైసీపీలో ప్రత్యక్షంగా చేరకపోయిన, పరోక్షంగా వైసీపీకి మద్ధతుగా ఉన్నారు. అయితే వంశీ వైసీపీ వెళ్లడంతో గన్నవరంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. ఈ క్రమంలోనే ఇటీవల బాబు కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జ్‌లని నియమించారు. అందులో భాగంగా  కృష్ణా జిల్లా గుడివాడకు రావి వెంకటేశ్వరరావుని మళ్ళీ ఇన్‌చార్జ్‌గా పెట్టారు. అటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గానికి బడేటి రాధాకృష్ణకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.

మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామయ్య (బుజ్జి) చనిపోయారు. దీంతో ఆ బాధ్యతల్ని బుజ్జి సోదరుడైన రాధాకృష్ణకు అప్పగించారు. ఇక గుంటూరు జిల్లా మాచర్లలో కొమ్మారెడ్డి చలమారెడ్డి, బాపట్లలో వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మకు బాధ్యతలు అప్పగించారు. తాజాగా పాయకరావుపేటకు వంగలపూడి  అనిత, ప్రత్తిపాడుకు మాకినేని పెద్ద రత్తయ్యలని నియమించారు.

ఈ క్రమంలోనే గన్నవరంలో బీసీ నేతకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సులో మాజీ జడ్పీ ఛైర్మన్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధ, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మరికొందరి పేర్లను అధిష్టానం పరిశీలించింది. కృష్ణాజిల్లాలో కమ్మ సామాజికవర్గ ఆధిపత్యం ఉన్నా గ్రూపులు మాత్రం చాలానే ఉన్నాయి. దీంతో గన్నవరం ఇన్ ఛార్జ్ విషయంలో కొన్ని నెలలుగా తీవ్ర తర్జన భర్జన పడుతున్న టీడీపీ అధినాయకత్వం చివరికి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఆరేళ్లుగా కృష్ణా జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ గ్రూపు తగాదాలను సమన్వయం చేస్తున్న అర్జునుడికి అవకాశం ఇవ్వడం ద్వారా అటు కమ్మ సామాజికవర్గంతో పాటు ఎస్సీల ఓట్లను కూడా రాబట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు.

అర్జునుడికి అవకాశం కల్పించడం ద్వారా సరిగ్గా ఇదే పరిస్ధితి ఎదుర్కొంటున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ నేత వెళ్లిపోగానే ఇన్ ఛార్జ్ ను ప్రకటించి గన్నవరంలో తన కులానికి చెందిన వారికి ప్రత్యామ్నాయం చూడలేదన్న విమర్శలకూ చంద్రబాబు చెక్ పెట్టినట్లవుతుంది. మొత్తానికైతే బీసీ వర్గంలో బలమైన నేతగా ఉన్న బచ్చుల అర్జునుడుకు ఇన్ చార్జ్ పదవి ఇవ్వడం వల్ల వంశీకి ఏ మేర చెక్ పెడతారో చూడాలి.

 

Leave a Reply