కరోనా వైరస్‌ను మించిపోయిందీ వైసీపీ వైరస్

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ”ఒక్క కంపెనీని తీసుకొచ్చే సమర్థత లేదు, యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు కానీ విశాఖలో లక్షణంగా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న 18 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ మండిపడ్డారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా? అంటూ నిలదీశారు.

“సింగపూర్ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్ అన్నీ ఈ 8 నెలల్లో క్యూ కట్టాయి. అమరావతిలో సచివాలయం ఉండగా అది చాలదన్నట్టు విశాఖలో మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట! చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ను మించిపోయిందీ వైసీపీ వైరస్. ఈ ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి” అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారవుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్‌కు జీవీఎల్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ ఇష్టమైతే ఆయన పార్టీలో చేరాలని సూచించారు. అమరావతిలో రైతుల ఆవేదన ఆయనకు కనిపించకపోవడం దారుణం అన్నారు. జీవీఎల్ నరసింహారావు ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కానీ.. ఆయన వల్ల ఒక్క రూపాయి లాభం లేదని విమర్శించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. జీవీఎల్ లాంటి దుర్మార్గమైన ఎంపీని తానెప్పుడూ చూడలేదన్నారు. జీవీఎల్ ఈ రాష్ట్రంలో పుట్టినందుకు తాము సిగ్గుపడుతున్నాం అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్ నపుంసకుడిలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రపజాలంతో సత్యనారాయణ విరుచుకుపడ్డారు.

 

Leave a Reply