టీడీపీ అభ్యర్ధుల్లో ఓటమి భయం పోయినట్లేనా…!

Share Icons:

అమరావతి, 23 ఏప్రిల్:

ఏపీలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఫలితాలు వెలువడటానికి చాలా సమయం ఉండటంతో టీడీపీ అధినేత అభ్యర్ధులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు.

అందులో భాగంగానే టీడీపీ నేతల్లో కనిపిస్తున్న ఓటమి భయాన్ని తొలగించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి ఏ విధంగా జరిగిందనే అంశంపై అభ్యర్థుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి ఓటింగ్ తీరుపై తన దగ్గర ఉన్న సమాచారాన్ని వారికి చంద్రబాబు అందించినట్టు తెలుస్తోంది.

అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే వైసీపీ నేతలు గెలుపు తమదే అంటూ ప్రచారం చేయడంతో… టీడీపీ నేతల్లో నిరాశ మొదలైంది. కానీ పోలింగ్ సరళి తమకే అనుకూలమని ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో జరిగిన సమీక్షలోనూ ఆయన ఇదే రకమైన ధీమాను వ్యక్తం చేయడంతో పాటు ఇందుకు సంబంధించి తన దగ్గర పక్కా సర్వేలతో కూడా సమాచారం ఉందని వారికి తెలియజేశారు.

ఇక అభ్యర్థులందరూ ఒకరి దగ్గర ఉన్న సమాచారాన్ని మరొకరు ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత ఓటింగ్ తీరుని పూర్తిగా వివరించడంతో కొందరు టీడీపీ అభ్యర్థులకు తమ గెలుపుపై భరోసా పెరిగిందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 

మామాట: మరి చూడాలి ఈ ధీమా ఫలితాల రోజు కూడా ఉంటుందో లేదో

Leave a Reply