ఆ విషయంలో ఎంత కష్టపడిన బాబుకు ఉపయోగం లేదా?

chandrababu comments on ap govt
Share Icons:

అమరావతి:

మొన్నటివరకు తిరుగులేని పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్తితి ప్రస్తుతం దారుణంగా ఉందనే చెప్పాలి. తాజా ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితం కావడం వల్ల ఇబ్బందికరమైన   పరిస్తితి వచ్చింది. పైగా ఆ పార్టీ ని చాలామంది నేతలు వీడి బీజేపీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా వీడటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఘోరంగా ఉంది.

దాదాపు అక్కడ కనమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ఆ పార్టీని నేతలందరూ వీడారు. ఇక అక్కడక్కడ మిగిలిన నేతలు కూడా జంప్ అయిపోవడానికి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీకి అధినేత చంద్రబాబు పూర్వ వైభవం తీసుకోస్తానని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఏపీలో అన్న కొంచెం పోరాడితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం చాలా కష్టం.

తెలంగాణలో పార్టీ అధికారానికి దూరమై దాదాపు 16 సంవత్సరాలు కావొస్తుంది. 2014లో 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుచుకున్న టీడీపీ 2019లో ఇద్దరు ఎమ్మెల్యేలకి పరిమితమైంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి పోటీకి దూరమైంది. అయితే టీడీపీ పెద్ద పెద్ద నాయకులతో పాటు చిన్న స్థాయిలో సైతం నాయకులని కోల్పోయింది. ఇందులో చాలమందిని టీఆర్ఎస్ లోకి వెళ్లిపోగా, కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇక మిగిలిన కొందరు తాజాగా బీజేపీలో చేరిపోయారు. చివరగా మిగిలిన నేతలు కూడా పార్టీ మారిపోవాలని చూస్తున్నారు.

మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో టీడీపీ  చచ్చిపోయిందనే చెప్పాలి.  ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న పార్టీని చంద్రబాబు నడపాలని చూస్తున్నారు. పైగా భారీ డైలాగులు కూడా వేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అశ్వరావుపేట కార్యకర్తలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు… ఇకపై తెలంగాణ మీద దృష్టి పెడతానని, కార్యకర్తల నుంచే నాయకులని తయారు చేస్తానని, మళ్ళీ పార్టీ పుంజుకునేలా చేస్తానని భారీ ప్రకటనలు చేశారు.

అసలు పార్టీ కనుమరగైపోతుందనే సమయంలో చంద్రబాబు ఇలాంటి మాటలు చెప్పడం విడ్డూరంగా అనిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీలో చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న పార్టీని బలోపేతం చేసే ఆలోచనలు చేయకుండా చచ్చిపోయిన చోట విఫలయత్నాలు చేయడానికి చూస్తున్నారు. బాబు ఎంత కష్టపడిన తెలంగాణలో పార్టీ బ్రతికి బట్టకట్టలేదు. పైగా ఈయన వ్యూహాలు వల్ల ఏపీలో కూడా పార్టీ నష్టం చేకూరే అవకాశం ఉంది. మొత్తానికి బాబు ఎంత కష్టపడిన ప్రయోజనం లేదు.

Leave a Reply