టీటీడీపీని విలీనం చేసే ప్రసక్తే లేదు: చంద్రబాబు

Share Icons:

సమావేశానికి డుమ్మా కొట్టిన మోత్కుపల్లి

హైదరాబాద్, 1 మార్చి:

తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబునాయుడు కార్యకర్తలకు చెప్పారు.

బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇతర పార్టీలతో టీడీపీని విలీనం చేసే ప్రసక్తే ఉండదని అన్నారు. పార్టీని విలీనం చేస్తామని వ్యాఖ్యలు చేసే అధికారం, స్వేచ్ఛ ఎవరికీ లేవని, టీడీపీ చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు.

పార్టీ శ్రేయస్సు కోసం కొన్నిసార్లు ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం జరుగుతుందని, పార్టీ మనుగడ కోసం కార్యకర్తలు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని సూచించారు.

అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులను త్వరలోనే నియమిస్తామని, కొంతమంది నాయకులు పార్టీని వీడినా పెద్దనష్టమేమీ లేదని అన్నారు.

పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే మేలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు సమావేశానికి హాజరుకాలేదు. ఇక టీడీపీని వీడి వేరే పార్టీలో చేరాతరంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ వంటేరు ప్రతా్‌పరెడ్డి సమావేశానికి వచ్చారు.

తెలంగాణలో టీడీపీ నుండి చాలామంది నాయకులు వెళ్లిపోతుంటే మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, జనగామకు చెందిన రాజారెడ్డి, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఆనంద్‌ చంద్రబాబు అధ్యక్షతన పార్టీలో చేరారు.

మామాట: పార్టీని బ్రతికించే ప్రయత్నాలు చేస్తునట్లున్నారు…

English summary:

The TDP national president  Chandrababu Naidu told the activists that Telangana TDP refused to merge into TRS party. Chandrababu met with party leaders and activists at NTR Trust Bhavan in Hyderabad on Wednesday.

One Comment on “టీటీడీపీని విలీనం చేసే ప్రసక్తే లేదు: చంద్రబాబు”

Leave a Reply