ఇలా అయితే కష్టం అంటున్న చంద్రబాబు…

Chandrababu Naidu today met with key leaders of the Telangana TDP
Share Icons:

హైదరాబాద్, 4 మే:

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలా పార్టీ అధ్యక్షుడు అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, దైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని చంద్రబాబు రమణకి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రానికి మహానాడు తరువాత మళ్లీ వస్తానని అప్పటిలోగా పార్టీ కమిటీలు పూర్తి చేస్తానని రమణకు బాబు చెప్పారు.

అలాగే త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని, 2019లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో తాను జాబితా సిద్ధం చేసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా తమ పార్టీ బలంగా ఉంటేనే ఎవరైనా పొత్తులకు ముందుకు వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇక నారా బ్రహ్మణి రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మణి రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణలో టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని సీఎంను తెలంగాణ నేతలు కోరారు. చంద్రబాబు నేతల కోరికను తోసిపుచ్చి, ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు.

మామాట: మళ్ళీ తెలంగాణ గుర్తొచ్చిందా బాబు….?

English summary:

TDP party president, AP Chief Minister Chandrababu Naidu today met with key leaders of the Telangana TDP at NTR Bhavan in Hyderabad. He was deeply dissatisfied with the TTDP president L.Ramana.

Leave a Reply