‘కియా’ ఇప్పుడు ఏపీ పరిశ్రమ…

Share Icons:

అనంతపురం, 22 ఫిబ్రవరి:

కియా మోటార్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ అని, దీని వలన రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అదేవిధంగా ఏపీని ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్ద భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ఫ్రేమ్ ఇన్‌స్టలేషన్ విభాగాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముందుగా కియా సంస్థకి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.

రైతులు చూపించిన చొరవతోనే కియా పరిశ్రమ ఈ జిల్లాకు వచ్చిందని పేర్కొన్నారు. అలాగే వాహన తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం కొరియా అని ప్రశంసించారు.

ఇక ప్రపంచంలోని అన్ని ప్లాంట్ల కంటే, అనంతపురం ప్లాంటే అధికంగా ఉత్పత్తులు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.

ఈ సంస్థ ప్రతినిధులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు.

ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొస్తున్నారని, ఆటోమొబైల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు.

అనంతరం 2021 నాటికి 21 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని, పది వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని కియా మోటార్స్ సంస్థ అధ్యక్షుడు పార్క్ అన్నారు.

మామాట: ఇది పూర్తిస్థాయి వినియోగంలోకి ఎప్పుడు వచ్చేనో..?

English summary:

Chief Minister Chandrababu Naidu said Kia Motors is now the Andhra Pradesh industry, which has a lot of benefits for the state. Similarly, the AP was built into an automobile hub.

Leave a Reply