ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదు…

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

కుప్పం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాల్గొనే రాష్ట్రపతి విందు కార్యక్రమానికి సీఎం జగన్‌ను ఆహ్వానించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేద ని ఆయన వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్న చంద్రబాబు… టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని.. వైసీపీ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని అన్నారు. జగన్ మూర్ఖుడిగా, సైకో లాగా మారిపోయారని… తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని విమర్శించారు.

సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్నారు. మీడియాపైన కేసులు పెట్టిస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని చంద్రబాబు విమర్శించారు. సోషల్ మీడియాతో టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో నారా లోకేష్ కుప్పంలో పర్యటిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామన్నారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తల దాడులకు భయపడవద్దని పేర్కొన్నారు.

అటు టీడీపీ హయాంలోని పథకాన్నే జగనన్న వసతి దీవెనగా పేరు మార్చారని టీడీపీ నాయకురాలు అనిత పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బాకీలు ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఇంజినీరింగ్‌ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు.

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ నోటిని అదుపులో పెట్టుకోవాలని అనిత హెచ్చరించారు. మహిళలను దుర్భాషలాడి… తిరిగి వారిపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఆడవారిపై ప్రతాపం చూపిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. వివేకా కేసుపై వేసిన సిట్‌ను జగన్‌ సోదరే నమ్మడం లేదని అనిత విమర్శించారు.

 

Leave a Reply