“గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు” ‘ముఖ్య మంత్రిపై చంద్రబాబు విమర్శ!

Share Icons:

‘ముఖ్య మంత్రి గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు.. గిరగిరా తిరుగుతున్నాడు. ఎక్కడో ఓ చోట శాశ్వతంగా ఫినిష్‌ అవుతాడు. మనతో పెట్టుకు న్నోడు కాలగర్భంలో కలిసిపోయాడు. కడుపు కాలుతోంది.. మండుతోంది’ అని చిత్తూరు జిల్లా పర్యటనలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాపానాయుడుపేట, తిరు చానూరు, రాయలచెరువు, తిరుపతిలో బుధవారం చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు.

టీడీపీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. హుదుద్‌ తుఫాను సందర్భంగా తాను విశాఖలోనే ఉండి వారంలో అన్నీ చక్కదిద్దానని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే మాత్రమే నిర్వహించారని విమర్శించారు. చంద్రగిరి– శ్రీకాళహస్తి మధ్య స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి లు, చెక్‌ డ్యామ్‌లు కట్టించానన్నారు. వాటిని కాపా డలేక వదిలేయడం వల్లే కొట్టుకుపోయాయని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీని వాయిదా వేసి వరద ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్‌ చేశారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply