TRENDING NOW

సస్పెండ్ అయిన పర్వాలేదు….పోరాడండి

సస్పెండ్ అయిన పర్వాలేదు….పోరాడండి
views:
16

అమరావతి, 13 మార్చి:

ఏ పార్లమెంట్ లో అయితే ఏపీకి అన్యాయం జరిగిందో, అదే పార్లమెంట్ లో రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, సస్పెండ్ అయిన పర్వాలేదు కానీ ఎంపీలు చేస్తున్న నిరసనలను కొనసాగించాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

ఈ రోజు ఉదయం ఆయన ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఏపీకి న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగించాలని, ప్రజల గొంతు పార్లమెంటులో ప్రతిధ్వనించాలని చంద్రబాబు ఎంపీలతో అన్నారు.

అలాగే ఎంపీలు ఎవరు నిశబ్ధంగా కూర్చోవద్దని, కలసికట్టుగా రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలిపేలా నిరసనలు చేపట్టాలని అన్నారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రావాల్సిన నిధుల వివరాలతో పాటు యూసీలు, డీపీఆర్ లన్నీ ఆన్ లైన్లో అందుబాటులో ఉంచామని, వాటిని ఎంపీలు వాడుకోవాలని అన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసినా ఫర్వాలేదని, బయటకు వచ్చి మరింత ఉద్ధృతంగా పోరావడాలని అన్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడని చెబుతూ, ప్రధాని కార్యాలయం చుట్టూ ఆయన తన కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని తిప్పిస్తున్నారని ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ పార్లమెంటు వేదికగా ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా స్థానికంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

మామాట: మరి ఈ పోరాటం వలన ఫలితం ఏమన్నా వస్తుందా..?

English summary:

Chief Minister Chandrababu has said that in any parliament, injustice will be done to the AP, and the same Parliament will fight for justice to the state. Chandrababu Naidu called on the MPs to continue the protests.

(Visited 11 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: