Header Banner
Header Banner
TRENDING NOW

సచివాలయానికి చంద్రబాబు రావచ్చు- ద్వివేది

సచివాలయానికి చంద్రబాబు రావచ్చు- ద్వివేది

అమరావతి,ఏప్రిల్ 19,

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా సెక్రటేరియట్ కు రావచ్చని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కొన్ని సమీక్షలను కూడా ముఖ్యమంత్రి నిర్వహించవచ్చన్నారు. పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల్లో… ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విషయం స్పష్టంగా ఉందని చెప్పారు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

ముఖ్యమంత్రి, మంత్రులు వారివారి కార్యాలయాల్లో కూర్చోవచ్చని, అయితే రాజకీయపరమైన పనులను మాత్రం చేపట్టకూడదని తెలిపారు. ముఖ్యమంత్రి సమీక్షలపై తమకు వైసీపీ ఫిర్యాదు చేసిందని…. దీనిపై సీఎస్ ద్వారా సంబంధింత అధికారుల నుంచి నివేదిక కోరుతామని… వారి నివేదికల ఆధారంగా చర్యలు చేపడతామని ద్వివేది చెప్పారు.

ఈ నెల 10వ తేదీన చంద్రబాబు తమ కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని… సీఈసీ కోరిక మేరకు సీఎం మాట్లాడిన మాటలను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నివేదికను పంపామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ ల భద్రతపై కూడా సీఈసీకి నివేదిక పంపామని చెప్పారు.

మామాట: రాజకీయాలు- పరిపాలన- ఎన్నికలు – గందరగోళం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: