దుర్మార్గాలు చేసినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు..

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై అన్ని చోట్లా ప్రెస్‌మీట్లు పెట్టాలని ఆయన నేతలకు సూచించారు. వైసీపీ గూండాల దౌర్జన్యాలను అడ్డుకున్నారని.. రాష్ట్రంలో విధ్వంస పాలన, వివక్ష పాలన నడుస్తోందని బాబు వివరించారు. అన్ని జిల్లాల్లో ఎస్పీలకు, కలెక్టర్లకు వినతులు ఇవ్వాలన్నారు. దుర్మార్గాలు చేసినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మనం ఎందుకు భయపడాలి..? అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల వైసీపీ దుర్మార్గాలు మన కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.

ఇక చంద్రబాబు మాట్లాడుతూ…బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదు చేయాలి. వైసీపీ దుర్మార్గాలపై ఆర్వోలకు ఫిర్యాదులు ఇవ్వాలి. మళ్లీ ఇలాంటి తప్పులు చేయాలంటే భయం రావాలి. మీ దగ్గర సాక్ష్యాధారాలను ఎన్టీఆర్ భవన్‌కు పంపండి.. మా వద్ద సమాచారాన్ని మీకు పంపిస్తాం. చట్టంలో నిబంధనలను తెలుసుకోవాలి, పాటించాలి. వాటిని ఉల్లంఘిస్తే సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయాలి. దొంగతనంగా మా ఇళ్లకు ఎలా వస్తారు..? ఎందుకు వస్తారు..?. బైండోవర్ చేసేందుకు వస్తే రాసిమ్మని అడగాలి. పౌర స్వేచ్ఛ హరించమని ఏ చట్టం చెప్పదు’ అని చంద్రబాబు తెలిపారు.

ఇక ‘చట్టం మనకెంత ముఖ్యమో వాళ్లకూ అంతే ముఖ్యం. మీరు పంపిన 30 వీడియోలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాయి. ఉన్మాదులను ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గం. దుర్మార్గ ప్రభుత్వాన్ని నియంత్రించే మార్గం ఇదే. గతంలో బాంబులతో వస్తేనే ధీటుగా ఎదుర్కొన్నాం.. ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాం. పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడ్తామంటే భయపడ్తారా..?. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల వీడియోలు పంపాలి’ అని బాబు చెప్పుకొచ్చారు.

 

Leave a Reply