బాబు…కోడెల, వంశీ నియోజకవర్గాలని ఎందుకు వదిలేశారో?

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి: ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత ఏపీలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోయిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా చంద్రబాబు పలు నియోజకవర్గాలకు ఇన్-చార్జ్‌లని నియమించారు. ఏలూరు నుంచి ఇదివరకు ఇంచార్జ్‌గా వ్యవహరించిన బడేటి బుజ్జి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే అదే కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్న మరో నేత బడేటి రాధా కృష్ణయ్య (చంటి) కి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక గుడివాడ నియోజకవర్గం విషయానికొస్తే.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన దేవినేని అవినాష్.. వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీంతో.. ఇదివరకు ఒకట్రెండు సార్లు పోటీ చేసి సీనియర్‌గా ఉన్న రావి వెంకటేశ్వర్లుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని టీడీపీ నిర్ణయించింది. అటు బాపట్లలో వేగ్నేష నరేంద్ర వర్మ, మాచర్లలో కొమ్మారెడ్డి చలమారెడ్డిలని నియమించారు.

ఇక పార్టీ మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గమైన గన్నవరం ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించని టీడీపీ అధినేత… గుంటూరు జిల్లా సత్తెనపల్లి విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మరణంతో సత్తెనపల్లి ఇంఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది.

ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్‌గా చంద్రబాబు కోడెల కుమారుడు శివరామ్‌కు అవకాశం ఇస్తారేమో అని చాలామంది ఎదురుచూశారు. అయితే ఆయన మాత్రం ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టారు. కోడెల కుమారుడైన శివరామ్ చేసిన పనుల కారణంగానే సత్తెనపల్లిలో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయనే భావనలో ఉన్న చంద్రబాబు… కావాలనే అతడిని పక్కపెట్టారనే వాదనలు వినిపించాయి. అయితే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం మరో కారణం కూడా ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ స్థానాన్ని రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు కూడా ఆశిస్తున్నారు.

గత ఎన్నికల్లో కోడెల ఉండటంతో… రంగబాబు ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా సత్తెనపల్లి ఇంఛార్జ్ పదవి తనకు ఇవ్వాలని రంగబాబు చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. అయితే కోడెల ఫ్యామిలీని పక్కనపెట్టి రంగబాబుకు ఇంఛార్జ్ పదవి ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తాయని టీడీపీ అధినేత భావించినట్టు తెలుస్తోంది. అందుకే సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవిని పెండింగ్‌లో పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

 

Leave a Reply