బాబ్లీ కేసు: కోర్టుకు హాజరుకాకూడదని  చంద్రబాబు నిర్ణయం…

ap cm chandrababu remembered his alipiri bomb blast
Share Icons:

అమరావతి, 6 అక్టోబర్:

బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి గత నెలలో జరిగిన విచారణకి చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.

కానీ ఈ కేసులో సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ధర్మాబాద్ కోర్టుకు హాజరు కాకూడదని చంద్రబాబు నాయుడు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. అడ్వొకేట్ జనరల్ తోనూ, సీనియర్ మంత్రులతోనూ చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు. 

ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా, వద్దా అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. హాజరు కాకూడదని కొంత మంది మంత్రులు అభిప్రాయపడగా, ర్యాలీగా వెళ్దామని మరికొంత మంది సూచించారు. అయితే, కోర్టుకు హాజరు కాకూడదనే చివరగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.

మామాట: మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో….

Leave a Reply