ఆ ముగ్గురికి టికెట్స్ కన్ఫామ్ అయ్యాయి….

Share Icons:

నెల్లూరు, 8 ఫిబ్రవరి:

ఏపీ శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొందరు అభ్యర్ధులకు టికెట్లు ఖరారు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకి సంబంధించి అభ్యర్ధులని ఖరారు చేసిన చంద్రబాబు….తాజాగా నెల్లూరు జిల్లాలో ముగ్గురు అభ్యర్ధులకు టికెట్స్ కన్ఫామ్ చేశారు. నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ.. మెుదట తాను ఎంపీగా పోటీ చెయ్యాలని భావించానని అయితే సీఎం చంద్రబాబు అసెంబ్లీకి పంపాలని ఆలోచిస్తున్నారని… ఆయన ఆలోచనల అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. 

ఒకవేళ తనకు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే కొవ్వూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించానని అయితే చంద్రబాబు నెల్లూరు రూరల్ అభ్యర్థిగా రూట్ క్లియర్ చేశారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో మెజారిటీ సీట్లు గెలిచి తమ బలం ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు.

మామాట: మొత్తానికి ముగ్గురు సీనియర్లు టికెట్స్ దక్కించుకున్నారు.. 

Leave a Reply