80 శాతం మంది మూడు రాజధానులు వద్దని చెప్పారు..

chandrababu comments on ap govt
Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. రాజధాని ఉద్యమంలో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినా మహిళలు వీరోచితంగా పోరాడారని అన్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. ‘పోలవరం, అమరావతిని ఆపేశారు. నాలుగైదు రెట్లు ఇసుక ధర పెంచేశారు. అటు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. 56 రోజులుగా అమరావతిపై ఆందోళనలు జరుగుతున్నాయి. 40 మంది రాజధాని రైతులు గుండె ఆగి చనిపోయారు. 80 శాతం మంది మూడు రాజధానులు వద్దని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇక రాజధాని రైతులు, మహిళలు పెద పరిమిలో‌ 22గంటల నిరవధిక‌ దీక్ష చేపట్టారు. ఏపీ నుంచి వైసీపీ తరపున గెలిచిన 22మందికి నిరసనగా ఈ‌ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. ఆ తండ్రి ఆశయాలకే తూట్లు పొడిచేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన తాము రోడ్డెక్కామని..‌ విశాఖ‌ ప్రజలు మోసపోవద్దన్నారు. కేంద్రం కూడా జోక్యం చేసుకుని అమరావతిని ఇక్కడే ఉంచేలా చూడాలన్నారు. జగన్ మొండిగా ముందుకెళితే మూకుమ్మడిగా ఆమరణ దీక్షలు‌ చేపడతామన్నారు.

ఇదిలా ఉంటే రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ డిమాండ్  చేసింది. లేకపోతే పవన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. పవన్ మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని పవన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడింది. న్యాయరాజధానిపై పవన్ వైఖరేంటో తెలపాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. సుగాలి ప్రీతి కేసు నిందితులను శిక్షించాలని మొదటి నుంచి తాము పోరాటాలు చేస్తున్నామని పేర్కొంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఖబడ్దార్ అని రాయలసీమ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.

 

Leave a Reply