13 జిల్లాల్లో బాబు టూర్…స్థానికమే లక్ష్యమా?

tdp president chandrababu sensational comments on jagan
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఏపీలో స్థానిక సంస్థలలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార వైసీపీకి ఓడించేలా వ్యూహాలకు పదును పెట్టారు. వారం పదిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆమేరకు తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసేలా ఆయనే స్వయంగా రంగంలోకి దిగనున్నారు. మండళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి.

అదేవిధంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించిన టీడీపీ.. వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని నిర్ణయించుకుంది. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లెలా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర నిర్వహించనున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు దీనిపై ప్రాధమిక చర్చ జరిగినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

చంద్రబాబు చేపట్టబోయే బస్సు యాత్రకు ‘ప్రజా చైతన్య యాత్ర’అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 45 రోజులపాటు ప్రజా చైతన్య యాత్ర సాగుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాలను టచ్ చేస్తూ రూట్ మ్యాప్ రూపొందించాలని పార్టీ నేతలు డిసైడయ్యారు. 13 జిల్లాల్లోని 100కుపైగా నియోజకవర్గాల గుండా చంద్రబాబు బస్సు యాత్ర చేసేలా ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు తెలిసింది.

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే విషయంలో సీఎం జగన్ ను గట్టిగా నివరించాలని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

Leave a Reply