మొన్న జాతీయ జెండా..నేడు గాంధీజీ: వైసీపీపై బాబు,పవన్ ఫైర్

janasena president pawan kalyan comments on jagan and ysrcp
Share Icons:

అమరావతి: వైసీపీ అధికారంలో రాగానే గ్రామ సచివాలయాల పేరిట ఓ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేసి వాటిని సచివాలయాలుగా మార్చారు. ఈ క్రమంలోనే ఇటీవల అనంతపురంలో ఓ గోడకు ఉన్న జాతీయ జెండాని తీసేసి దానికి వైసీపీ రంగు వేశారు. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ కావడంతో మళ్ళీ రంగు మార్చేశారు. అయితే తాజాగా ఓ గాంధీజీ విగ్రహానికి వైసీపీ రంగు వేశారు. కింద విగ్రహం దిమ్మకు రంగులు వేశారు.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ట్విట్టర్ లో ఫోటో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  ‘వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ???’ అని పవన్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేసి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.

‘ఇటీవల జాతీయ జెండాను అవమానించడంతో వచ్చిన విమర్శల నుంచి కూడా వైసీపీ నేర్చుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోంది. విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్నారు. ఎందుకీ దురహంకారం?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు, మంత్రి కొడాలి నానిలపై కేసులు

హిందువులు పరమ పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూను మద్యంతో పోల్చినందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మద్యం ధరలను పెంచినట్టుగానే, తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతున్నారని, పేదలకు లడ్డూను దూరం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. అటు తిరుపతి డిక్లేరేషన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై కూడా కేసు నమోదైంది. తిరుమలకు దర్శనానికి వెళుతున్న సమయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వడం లేదని టీడీపీ తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాజకీయ ఆరోపణలకు తిరుమల వెంకన్నను టార్గెట్ చేసుకోవడం ఏంటని మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు.

 

Leave a Reply