తడబాట్లతో పోటీ పడుతున్న తండ్రి, కొడుకులు

Chandrababu and lokesh speech mistakes
Share Icons:

విజయవాడ, సెప్టెంబరు 04:

లోకేష్ ఆ మధ్య చెప్పాడు. తన తండ్రితో తను పోటీ పడలేకపోతున్నాను అని. ఆ పోటీ దోచుకోవడంలో అని కొందరు కాని వారు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ తండ్రీ కొడుకులు పోటీ పడుతున్న వ్యవహారం మరోటి ఉంది. అదే.. తడబాట్లు. అర్థంలేని మాటలు మాట్లాడటంలో. బావగారు బాగున్నారా సినిమాలో… కోట శ్రీనివాసరావు, శ్రీహరిల మధ్యన కామెడీ సీన్లలో ఒక డైలాగ్ బాగా పేలింది. ‘నా ఎదవతనంతో పోలిస్తే.. నీదో ఎదవతనం ఓ లెక్కరా..’ అంటూ కోట శ్రీనివాసరావు శ్రీహరితో కామెడీ చేస్తూ ఉంటాడు. అప్పట్లోనే కాదు.. ఈ కామెడీ ఇప్పటికీ హైలెట్టే. అలా తండ్రీ కొడుకులుగా ఆ సినిమాలో కోట, శ్రీహరిలు చేసినా కామెడీకి తీసిపోనట్టుగా తయారయ్యారు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు.

మాట తడబాటులో తండ్రీకొడుకులు ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ తడబాట్లతో వీరు చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. కులపిచ్చి, మతపిచ్చి, అవినీతి, బంధు ప్రీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అని లోకేష్ బాబు గతంలో వ్యాఖ్యానించడం పసందుగా నవ్వుకోదగిన అంశం. ఇక సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనమే ఉరి వేసుకున్నట్టని చంద్రబాబు నాయుడు తనయుడు గతంలోనే బహిరంగ హెచ్చరిక జారీ చేశాడు. ఇక చంద్రబాబుకు ఈ ట్రాక్ రికార్డు ఏమీ తక్కువ కాదు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అనినీతిలో కానీ అభివృ ద్ధిలో కానీ ఏపీ నంబర్ వన్..’ అని ప్రకటించాడు. ఇక ఒక సభలో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ సాక్షిగా భారతదేశాన్ని అవినీతి దేశంగా నిలిపేంత వరకూ నిద్రపోను’ అని బాబు ప్రతినబూనాడు.

ఇక తెలుగుదేశం పార్టీ బ్రిటీష్ వారితో పోరాడిందని సెలవిచ్చిన ఘనత కూడా చంద్రబాబుదే. ఇక చంద్రబాబు చెప్పే వేరే రకమైన సొల్లు వేరే ఉంటుంది. ప్రపంచానికి తనే ఐటీ నేర్పించాను అని ప్రకటించడం.. సత్యా నాదెళ్ల, పీవీ సింధూ.. ఒలింపిక్స్‌లో మెడల్ వస్తే నోబెల్ అవార్డును ఇస్తానని అనడం… ఇలాంటివెన్నో అదనం. ఇక వాటన్నింటికీ తోడు ‘అలెగ్జాండర్‌ను ఈ దేశ రాష్ట్రపతిగా చేసింది నేనే..’ అని చంద్రబాబు ప్రకటించుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదీ పరిస్థితి. జంధ్యాల సినిమా ఒకదాంట్లో శ్రీలక్ష్మి కవితలు విన్నాకా వెర్రెక్కిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడే పొట్టి ప్రసాద్ మాటలు గుర్తుకు వస్తున్నాయి.

మామాట: మొత్తానికి తండ్రి, కొడుకులు ఈ రకంగా పోటీ పడుతున్నారు అనమాట…!

Leave a Reply