బాబూ… మీ అనుభవంతో ఆంధ్రాకు ఒరిగిందేంటి…? పెరిగిందేంటి.. ?

బాబూ… మీ అనుభవంతో ఆంధ్రాకు ఒరిగిందేంటి…? పెరిగిందేంటి.. ?
Views:
63
  • అపర చాణుక్యత ఏమయ్యింది?

  • రెవెన్యూలోటు ఎందుకు సాధించుకోలేకపోయారు?

  • బీజేపీని ఆంధ్రా నెత్తికి కట్టిన పాపం మీది కాదా?

‘చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు…’, ‘చంద్రబాబు సీరియస్ అవుతున్నారు..’, ‘చంద్రబాబు ఆగ్రహం’ వ్యక్తం చేస్తున్నారు.  ‘చంద్రబాబు మండిపోతున్నారు’. ఎవరి మీద? కేంద్ర ప్రభుత్వం మీద. ఎందుకు? కేంద్రం చెల్లించాల్సిన రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటును ఇంకా చెల్లించలేదని లెక్కలు చూపుతూ ఉగ్రరూపుడవుతున్నాడు. ఇది ప్రస్తుతం ఆయన అనుకూల మీడియాలో వస్తున్న వార్తలు. ‘అవును నిజమే’ అందులో ఏమాత్రం అనుమానం లేదు. కేంద్రం నుంచి లోటు బడ్జెట్ కింద రూ. 16, 447 కోట్లు రావాల్సిందే. ఇది ఎప్పటిది. రాష్ట్రం విడిపోయినప్పడు తేలిన లెక్కలు. గుడ్ మంచిదే అన్ని వేల కోట్లు వస్తే ఇంకా కావాల్సింది ఏముంటుంది? రాష్ట్రం బాగుపడి పోతుంది కదా? కానీ, రావడం లేదెందుకు? ఇదే ప్రశ్న. ఇందులో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తప్పిదమెంత? మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న స్వయంకృతాపరాథం ఎంత? ఒక్క సారి చూద్దాం…

రాష్ట్రం విడిపోయే నాటికి ప్రధాన ఆదాయ వనరులలో చాలా భాగం తెలంగాణకు వెళ్ళిపోయాయి. హైదరాబాద్ నగరం, అక్కడున్న వ్యాపారాలు అన్ని తెలంగాణకే చెందాయి. అయితే ఆ సమయంలో అప్పులు మాత్రం జనాభా ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. అప్పట్లో 16 వేల కోట్లపై చిలుకు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం. అంతలేదని కేంద్రం అంటోంది. కేవలం 12 వేల కోట్లు రావాల్సి ఉందని అంటున్నారు. ఇది తేలని లెక్క. ఒక్క యేడాది కాదు. రెండేళ్ళు కాదు. నాలుగేళ్లుగా తేలని లెక్క. అక్కడున్నదితెలుగుదేశం భాగస్వామ్య ప్రభుత్వం.. ఇక్కడున్నది భారతీయ జనతాపార్టీ భాగస్వామ్య ప్రభుత్వం. ఎన్నికలకు ముందు కూడా ఈ రెండు పార్టీలు కలసి ప్రచారం చేశాయి. ఎన్నికల తరువాత కూడా కలిసే నడిచాయి. అంతరవరకూ బాగానే ఉంది. కానీ, తంటా ఎక్కడ వచ్చిందనేది పెద్ద ప్రశ్న.

మీ పాచికలు చెల్లలేదా అపరచాణుక్యా..?

chandrababu naidu teleconferenceవెంటనే రావాల్సిన 16 వేల కోట్లు లేదా కేంద్రం అంటున్నట్లు 12 వేల కోట్లు. మొత్తానికి 12 వేల కోట్లకు పైమాటే. ఇది ఖాయం కదా..? అయితే ఈ మొత్తాన్ని తెలుగుదేశం నాయకులు చెబుతున్నట్లు దేశంలోకెల్లా అనుభవం కలిగిన సీనియర్ రాజకీయ నాయకుడు, రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన తప్ప మరొక్కరు తీర్చి దిద్దలేని ముఖ్యమంత్రిగా పేరు పొందిన నారా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు ఎందుకు రాబట్టలేకపోయారు.? అక్కడ మీ మంత్రులు పని చేస్తున్నారు. కదా. పైగా ప్రశ్నించేతత్వం ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ ఉండనే ఉంది. దక్షిణ భారతదేశంలోనే కాదు. భారతదేశంలోనే కేంద్రంలో వాజ్‌పేయి పాలనలో చక్రం తిప్పిన అనుభవం ఉన్న చంద్రబాబు తమ భాగస్వామ్య ప్రభుత్వంలో కనీసం సొంత రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు  రాబట్టుకోలేకపోయారు? ఆయన చెప్పే మిత్ర ధర్మం ఇక్కడ పని చేయలేదా…? ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఉన్న పళంగా సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేసి విజయవాడకు తరలి వచ్చిన తరువాత ఆయనలో చాతుర్యం తగ్గిపోయిందా?

సరే మొదటి సంవత్సరం గడిచిపోయింది. బాగానే ఉంది. ఆ సంవత్సరం తాత్కాలిక రాజధాని నిర్మాణం బిజీలో మరచిపోయారు. మరి మరుసటి సంవత్సరమైనా మోడీతో మాట్లాడి లేదా ఆర్థిక మంత్రులతో మాట్లాడి అక్కడకు అధికార గణాన్ని పంపి తక్షణం ఇవ్వాల్సిన రెవెన్యూ లోటును ఎందుకు సాధించుకోలేకపోయారు… అపరచాణుక్యా..! చంద్రబాబు నాయుడుగారు అని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. పోనీ, తరువాత సంవత్సరంలో ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు. మూడేళ్ళలో… సార్… కేంద్రం ఇవ్వాల్సిందే అనుమానం లేదు.  అందులో అనుమానం లేదు. కానీ, ఆంధ్రప్రజలు బీజేపీని నమ్మి ఓట్లేలేయలేదు బాబుగారూ… మిమ్మల్ని చూసి.. మీ అనుభవాన్ని చూసి, మీ చాతుర్యాన్ని చూసి, కొత్త రాష్ట్రంలోని పరిస్థితులను చంద్రబాబు మాత్రమే చక్కదిద్దగలరని ఎంతోకొంత మంది అనుకోవడం వలననే మీరు అధికారంలోకి వచ్చారు’ అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలాంటి పరిస్థితులలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మీది కాదా? దాదాపు నాలుగేళ్ళలో ఎన్నిమార్లు ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించలేకపోయారు. మీకున్న అనుభవంతో అందరి మద్దతుకు ఎందుకు కూడగట్టలేకపోయారు. ఇది మన ఉదాసీనతా స్వభావమా..? బీజేపీ కఠినత్వమా..? కఠినత్వమే అయితే ఇన్నాళ్ళు బీజేపీతో అంటకాగాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్ప…!

CM Chandrababu ranks announce to ministersరాష్ట్ర విభజనలో కూడా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులే మిగిలాయి. ఆదాయం మార్గం ఉన్న హైదరబాద్ నగరం తెలంగాణకు చేరిపోయిందనే వాదన తెలుగుదేశం నాయకులు, పాలకులు కోడై కూస్తున్నారు. కేంద్రం నుంచి లోటు బడ్జెట్‌ను ఏదోకరకంగా తెచ్చుకోవాల్సిన మీరు చేసిందేమిటి? విదేశీ రుణం ఆంధ్రప్రజల నెత్తిన రుద్దుతారా? ఇది ఎంత వరకూ సమంజసం? రాష్ట్రం ఏర్పాడే నాటి నుంచి రాష్ట్రం విడిపోయే వరకూ ఎంత అప్పు అయితే ఉందో అంతకు మించిన విదేశీ రుణాలు రాష్ట్రం తరుపున చేశారనే ఆరోపణలున్నాయి. సాధారణంగా ఆదాయం, సామర్థ్యాన్ని అనుసరించి రాష్ట్రానికి ఒక కాలపరిమితిలో 15 వేల కోట్లకు మించి విదేశీ రుణం తీసుకోవడానికి వీలులేదు. కానీ, అంతకు మించి 30 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి కేంద్రమూ అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకూ విదేశీ రుణం కింద 60 వేల కోట్లకుపైగానే అప్పులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

మరి ఇవి దేనిని సూచిస్తాయి.?

Chandrababuఎటువంటి వడ్డీ లేకుండా హక్కుగా కేంద్రం నుంచి రావాల్సిన 16 వేల కోట్ల పైచిలుకు రెవెన్యూ లోటు రాబటట్టుకోకుండా వీపునకు విమానం కట్టుకుని ప్రపంచం చుట్టేసి ఆంధ్రప్రదేశ్‌ను అప్పల కుప్ప చేసి కేంద్రం సాయం చేయడం లేదని నేడు అనడంలో అర్థం ఏంటి? కేంద్రం నుంచి ఫలానా రావాలి. రండి కలసిపోరాడుదామనే మాట ఏనాడైనా ఆంధ్రా పాలకుడి నోటి నుంచి వచ్చిందా?. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అంటే మీకు నచ్చదు. వారిని పక్కన పెట్టేద్దాం. మరి మిగిలిన పక్షాలను ఏనాడైనా పిలిచిన పాపానపోయారా? ప్రశ్నించిన మేధావుల నోరు మూయించారు. పోరాడితే నష్టపోయేది రాష్ట్రమేనని పదే పదే చెప్పి భయపెట్టారు. ఒత్తిడి తీసుకువచ్చి సాధిస్తామని ఢంకా బజాయించి చెప్పారు. పుణ్యకాలం గడిపోయిన తరువాత మీరు చెబుతున్నదేంటి.? లెక్కలు తేలలేదని చావుకు కబురు చల్లగా చెబుతారా? కేంద్రం ఇవ్వలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కాదా? ఇదేనా మీ రాజకీయ చతురత ?

అంత బడ్జెట్ ఎలా వచ్చింది?

రాష్ట్రం విడిపోయే నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఎంత బడ్జెట్ 1.61 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేది. రాష్ట్రం విడిపోయిన తరువాత న్యాయంగా ఎంత బడ్జెట్ ఉండాలి ? 80 నుంచి 90 వేల కోట్ల ఉండాలి. లేదూ మరో 2లేదా మూడు వేల కోట్లు ఉండవచ్చు. కానీ ఈ నాలుగేళ్ళలో ఏనాడైనా లక్షకు తగ్గిందా..? తెలంగాణతో పోల్చుకుంటూ బడాయికి పోయి ఇంత బడ్జెటును చూపాల్సిన అవసరం ఏమొచ్చింది? అది చివరకు 1.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఒకవైపు బీద రోదనలు వినిపిస్తూనే మనం కేంద్రానికి పంపిన సంకేతాలేంటి.?

On Monday CM chandrababu teleconference  on janmabhoomi and neeru-pragathi  programs

విదేశాల నుంచి తీసుకువచ్చిన రుణాన్ని కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆదాయం కింద చూపిన ఘనత కూడా మనది కాదా? కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన సొమ్ముపై పోరాటం చేయకుండా నేడు ఇలా మాట్లాడడంలో అర్థమేంటి.? చంద్రబాబు గారు.? ఈ చివరకు యేడాదిలో కూడా మీకు కేంద్రం నుంచి రిక్త హస్తమే మిగిలింది… రాష్ట్రంలో రాజకీయ అధిపత్యం కోసం బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్యన సమిధలవుతున్నది ఆంధ్రా ప్రజలు కారా? కిం కర్తవ్యం?

నాడు విభజన సందర్భంగా హోదా ఇస్తామని, కాంగ్రెస్ చేసిన విభజన చట్టాన్ని మించే ఇస్తామన్న బీజేపీ, నేడు తెలుగుదేశం మీద కక్షతో ఆంధ్రాను వేధిస్తోందనడం ఎవరికైనా అనుమానం ఉందా? ఇవ్వకపోయినా.. ఇచ్చినా వచ్చేదేమి లేదకునే బీజేపీతో పోల్చుకుంటే తెలుగుదేశం తప్పిదాలేంటి? అసలు బీజేపీని ఆంధ్రా నెత్తికి కట్టిన పాపం మీది కాదా?

మామాట : అనుభవం, చాణుక్యత అన్నీ రాజకీయాల కోసమేనా…?

English Summary :

AP Chandra Babu is fires on Central Goverment on AP assurances. He is not questioned single day in four years. But now he is questioning the BJP and blaming.

(Visited 9 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: