చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదా! 

Share Icons:

తిరుపతి, ఏప్రిల్ 20, 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల పర్వం ముగిసింది. తెలంగాణ ప్రశాంతంగానే ఉన్నా, ఏపీలో మాత్రం రాజకీయ సెగలు ఇంకా చల్లారలేదు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన సమీక్షలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సీఎం ఎలాంటి సమీక్షలు నిర్వహించరాదని వైసీపీ నేతలు అంటున్నారు.

అసలు ఈ ‘ఆపద్ధర్మ’ ఏంటో ఒకసారి చూద్దాం.  రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న లోక్ సభ కానీ, శాసనసభ కానీ కాలపరిమితి కంటే ముందుగానే రద్దయినప్పుడు… కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు అప్పటిదాకా ఉన్న ప్రధానిని కానీ, ముఖ్యమంత్రిని కానీ  ఆపద్ధర్మంగా కొనసాగాలని రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరతారు.

అప్పటిదాకా ఉన్న మంత్రులు కూడా అవే బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఇలా కొనసాగే ప్రభుత్వాన్నే ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. పాలన కొనసాగించే వారిని ఆపద్ధర్మ ప్రధానమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు. అయితే, అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రధాని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి భారత రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావనా లేదు. ఈ విషయాన్ని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు.

ఆపద్ధర్మ ప్రభుత్వం రాజ్యాంగంలో లేనప్పటికీ, మన దేశంలో ఒక సంప్రదాయంగా వస్తోందని అంటున్నారు. అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. కేవలం కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు, రోజువారీ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. నామినేటెడ్ పదవుల భర్తీ, ఉన్నతాధికారుల బదిలీలు, భారీ ప్రాజెక్టుల ప్రకటన, బడ్జెట్ తయారీ, ఆర్డినెన్సుల జారీ లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోరాదు.  

విశేషం…ఏమిటంటే…

ఏపీ లో 2014లో ఎన్నికైన ప్రభుత్వానికి ఇంకా కాలపరిమితి ఉంది. కొంత ముందుగా, అదీ తొలిదశలోనే ఇక్కడ ఒకే సారి శాసన సభ కూ, లోక్ సభకూ ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితాలు రావడానికి ఇంకా నెలకు పైగా సమయం ఉంది. ఇక్కడ పోలింగ్ గత 11 వ తేదీనే పూర్తయింది. మళ్లీ పోలింగ్ లేదు. దీనితో ప్రభుత్వం ఉన్నట్టా, లేనట్టా, పోలింగ్ జరిగితే అప్పటికి ఉన్న ప్రభుత్వ కాలపరిమితి ముగిసిపోతుందా? అది ఆపధర్మ ప్రభుత్వం అవుతుందా?    

ఇలా ఎన్నికల సంఘం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాలపరిమితిని నిర్ణయించగలదా.. అలా అనుకుంటే ఐదేళ్ల గడువు కంటే ఆరు మాసాల ముందుగానే ఎన్నకలు జరిపితే పరిస్థితి ఏమిటి. ముందస్తు ఎన్నికలకు వెళ్లన తెరాస అధినేతను ముందుగానే పాలనా కాలం వదులుకుంటున్నాడు అన్న వారే .. ఇక్కడ చంద్రబాబును మాత్రం పరిపాలించ వద్దనండం వివాదాస్పదంగా మారింది. ఒక వేళ ఫలితాలు రావడానికి ఇంకా ఆలస్యం అయితే అప్పటివరకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఏం చేస్తూ ఉండాలి.

మామాట: మార్చిండి రాజ్యాంగాన్ని.. మరింత మెరుగ్గా

Leave a Reply