చంద్ర‌బాబుపై ఏపీ సీఎస్ ప‌రువున‌ష్టం దావా!

Share Icons:

అమరావతి, ఏప్రిల్ 15,

ఏపీ రాజ‌కీయాలు ఎన్నిక‌ల అనంతరం కూడా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి.   ఏపీ ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడు తీరుపై  ప్ర‌భుత్వ సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం గుర్రుగా వున్నట్టు సమాచారం. ఆయన బాబుపై ఏకంగా ప‌రువు న‌ష్టం ద‌వా వేయ‌బోతున్నారట. ఇది దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే విపరీత పరిణామంగా మారబోదోంది. ఒక సీఎస్ త‌ను ప‌నిచేస్తుండ‌గానే త‌న ముఖ్య‌మంత్రిపై ప‌రువున‌ష్టం దావా వేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌మ్మోహ‌న్‌రెడ్డి కేసులో ఎన్నికల కమిషన్ ఇటీవలి నియమించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా దోషేన‌ని   చంద్ర‌బాబు నాయుడు ప‌త్రికా ముఖంగా విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాంటి వ్య‌క్తిని సీఎస్‌గా ఎందుకు నియ‌మించార‌ని బాబు ఈసీని ప్రశ్నించిన  ద‌రిమిలా ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం చంద్ర‌బాబు నాయుడుపై ప‌రువున‌ష్టం దావా వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

బాబు వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ అయిన మాజీ రిటైర్ట్ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంకు అండ‌గా నిలిచార‌ని, అత‌న్ని బాబుపై ప‌రువు న‌ష్టందావా వేయ‌మ‌న్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మామాట: ఇనము విరిగెనేని .. పద్యం గుర్తుందా..

Leave a Reply