కరణం, గొట్టిపాటిలపై చంద్రబాబు ఆగ్రహం…….

Share Icons:
అమరావతి: 1 డిసెంబర్

గురువారం సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల ముందు ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

పార్టీ పరువు తీస్తున్నారు: చంద్రబాబు

ఏపి సచివాలయంలో గురువారం ఘర్షణ పడ్డ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ నేతలు కరణం బలరాం, గొట్టిపాటి రవిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఆయన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

గొడవలు పడటం ద్వారా నేతలు పార్టీ పరువు తీస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, పార్టీలో పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా కొనసాగాలని ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.

చేరికల వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నా అని, పదవులు ఇచ్చి గౌరవిస్తున్నానని, ఇంకా ఏం కావాలని అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలకు నియోజకవర్గ బాద్యతలు ఇచ్చిన తర్వాత ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు.

పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

మామాట: ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఒక ముఖ్యమంత్రి అనడం చాలా విడ్డూరం.

మరో సారి కుమ్ములాటకు సిద్దమయిన కరణం, గొట్టిపాటి….

Leave a Reply