TRENDING NOW

కాంగ్రెస్ మెలికలు పెడుతోంది: చాడ

కాంగ్రెస్ మెలికలు పెడుతోంది: చాడ

హైదరాబాద్, 8 నవంబర్:

మహాకూటమి పొత్తులో భాగంగా తాము 9 స్థానాలను అడిగామని, చివరకు 5 స్థానాలు ఇచ్చినా కూటమిలో కలిసుంటామని చెప్పామని టీసీపీఐ అధ్యక్షుడు చాడ వెంకట రెడ్డి గుర్తు చేశారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మహాకూటమి ఏర్పాటు విషయంలో తాను ఎంతో చొరవ తీసుకున్నానని, మహాకూటమితో పొత్తులో భాగంగా, తాము ఎంతగా దిగివచ్చినా, కాంగ్రెస్ ఇంకా మెలికలు పెడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

తాము కనీసం 5స్థానాలన్న ఇవ్వాలని కోరుతుంటే కాంగ్రెస్ మాత్రం 3 ఎమ్మెల్యే స్థానాలను, 2 ఎమ్మెల్సీ స్థానాలను ఆఫర్ చేస్తోందని, దీనికి తాము అంగీకరించబోవడం లేదని చెప్పారు.

చివరి ఆప్షన్‌గా నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీని తాము కోరుతున్నామని, అందుకు కూడా అంగీకరించకుంటే, కూటమికి దూరం కావడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

అయితే కూటమిని స్థిరంగా ఉంచాలన్నదే సీపీఐ అభిమతమని, అందుకోసం పలు ప్రతిపాదనలను సిద్ధం చేశామని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ పెద్దలేనని చాడ వ్యాఖ్యానించారు.

మామాట: మొత్తం కాంగ్రెస్ చేతిల్లోనే ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: