నయూం బాధితులకు న్యాయం చేయాలి…

Share Icons:

హైదరాబాద్, 12 ఫిబ్రవరి:

గ్యాంగ్ స్టర్ నయూం బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీకార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈరోజు సోమజిగూడా ప్రెస్‌క్లబ్‌లో నయూం బాధితుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,  రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలువురు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… నయూం బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

దీని కోసం ఏర్పాటు చేసిన సిట్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు.

అసలు సిట్ వల్ల ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదని, చిన్న చేపలను పట్టుకుని పెద్ద  వాళ్ళను విడిచి పెట్టారని అన్నారు. ఇక కొంత మంది రాజకీయ నాయకులు అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారని ఆయన మండిపడ్డారు.

అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… నయూం ఇదంతా పోలీసుల సహకారంతోనే చేశాడని, ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉందని మండిపడ్డారు.

వామపక్ష ఉద్యమాన్ని అణచివేసేందుకే నయీమ్‌ని తయారు చేశారన్నారు. ఒకవేళ నయీమ్ బ్రతికి ఉంటే అమిత్ షా లోపల ఉండేవాడని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక ఇందులో టీఆర్‌ఎస్ వాళ్ళు కూడా ముద్దాయిలే అని, కేసీఆర్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలని విమర్శించారు.

మామాట: న్యాయం జరిగేనా….

English summary:

Telangana state secretary Chada Venkat Reddy demanded the government to do justice to victims of gangster nayeem. CPI National Secretary Narayana, State Secretary Chada Venkat Reddy and many other Communist Party leaders participated in the meeting for the victims of nayeem today in Somajiguda Press Club.

Leave a Reply